చేత్తో తినడం నుంచి అత్తగారింట్లో ఉండటం వరకు.. అమెరికన్లకు నచ్చని 8 భారతీయ అలవాట్లు ఇవే!

అమెరికా నుంచి ఢిల్లీకి ( Delhi )షిఫ్ట్ అయిన క్రిస్టెన్ ఫిషర్ ( Kristen Fisher )అనే మహిళ ఇండియాలో కొన్ని ఏళ్లుగా ఉంటోంది.అయితే, ఇక్కడి లైఫ్ స్టైల్ చూసి తను షాక్ అయిందట.

 From Eating With Your Hands To Staying At Your In-laws' House, Here Are 8 Indian-TeluguStop.com

కొన్ని అలవాట్లు అమెరికన్లకు అస్సలు రుచించవని, చాలా వింతగా అనిపిస్తాయని రీసెంట్ గా ఓ వీడియోలో చెప్పింది.అవేంటో తెలుసుకుందాం పదండి.

మొదటిది టాయిలెట్ పేపర్ బదులు జెట్ స్ప్రే వాడటం.అదేంటి నీళ్లతో కడుక్కుంటారా, అని చాలామంది అమెరికన్లు ముక్కున వేలేసుకుంటారట.

వాళ్లకు ఇది చాలా కొత్తగా, ఇబ్బందికరంగా అనిపిస్తుందట.

ఇంకో విచిత్రమైన విషయం చెప్పులు షేర్ చేసుకోవడం.

మన ఇళ్లల్లో ఎవరొచ్చినా వేసుకోవడానికి ఎక్స్‌ట్రా చెప్పులు పెడతాం కదా.కానీ అమెరికాలో ఎవరి చెప్పులు వాళ్లకే.ఎవరితోనూ షేర్ చేసుకోరు.కామన్ చెప్పులు వేసుకోవాలంటే అమెరికన్లు తెగ ఇబ్బంది పడిపోతారట.ఇక మన దగ్గర ఒక బాటిల్ ఉంటే అందరూ కలిసి తాగేస్తాం.అదే అమెరికాలో అయితే ఎవరి బాటిల్ వాళ్లదే.

షేర్ చేసుకుంటే ఏదో జబ్బులొస్తాయని భయపడతారట.

ఫుడ్ విషయానికొస్తే, మన దగ్గర టేబుల్ మీద రకరకాల వంటలు పెట్టి అందరూ కలిసి ఒకే దాంట్లో నుంచి తింటారు.

కొందరు సపరేట్ ప్లేట్లు పెట్టుకుంటారనుకోండి కొందరు మాత్రమే ఒకరి ప్లేట్లో నుంచి ఒకరు ఆహారం తీసుకొని తినేస్తారు.కానీ అమెరికాలో ( America )ఎవరి ప్లేట్ వాళ్లదే, ఎవరి ఫుడ్ వాళ్లదే.

షేరింగ్ అంటే వాళ్లకు అస్సలు నచ్చదు.చేత్తో తినడం గురించి ఎంత చెప్పినా తక్కువే.

మనకు అది అలవాటే కానీ అమెరికన్లకు మాత్రం చేతులు మురికి అవుతాయని తెగ ఫీలవుతారు.స్పూన్లు, ఫోర్కులు ఉంటేనే హ్యాపీగా తింటారన్నమాట.

బండిలో పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు సీట్ బెల్టులు ( Seat belts )పెట్టకపోవడం చూసి కూడా అమెరికన్లు షాకవుతారు.అక్కడ పిల్లల్ని కార్ సీట్లలో పెట్టి, బెల్టులు తగిలిస్తేనే బండి కదులుతుంది.ఇక్కడ పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని వెళ్లడం వాళ్లకు చాలా డేంజర్ అనిపిస్తుంది.పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకోవడం మనకు కామన్.కానీ అమెరికాలో పిల్లలకి వేరే రూమ్, తల్లిదండ్రులకు వేరే రూమ్.సపరేట్ గా పడుకుంటేనే వాళ్లకు నిద్ర పడుతుందట.

చివరిగా పెళ్లయ్యాక అత్తగారింట్లో కాపురం పెట్టడం మన దగ్గర చాలా సహజం.కానీ అమెరికాలో పెళ్లైన వెంటనే సొంత కాపురం పెట్టేస్తారు.

అత్తామామలతో కలిసి ఉండటం వాళ్లకు అస్సలు అలవాటు లేదు.

క్రిస్టెన్ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.8 లక్షల వ్యూస్, 20 వేల లైక్స్ కొట్టాయంటే మామూలు విషయం కాదు.కొందరు ఇండియన్ కల్చర్ ని పొగిడితే, మరికొందరు మాత్రం డిఫరెన్సెస్ చూసి ఆశ్చర్యపోయారు.

ఏదేమైనా.ఒక్కొక్క దేశానికో ఒక్కో అలవాటుంటుంది.

ఏది రైటో, ఏది రాంగో చెప్పలేం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube