అమ్మ బాబోయ్, ఏం టాలెంట్రా బాబు వీళ్లది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ( socilal media )వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు అనకుండా ఉండలేరు.ఇందులో మిరపకాయలు దంచడానికి రోలు, రోకలి వదిలేసి, ఏకంగా సీసా ఆటలాడే బల్లనే వాడేశారు ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.
ఇంటర్నెట్‌లో ఈ వీడియో చూసినోళ్లంతా గొల్లున నవ్వుతున్నారు._hetals_art అనే ఇన్‌స్టా పేజీలో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం చేశారంటే, ఇద్దరమ్మాయిలు నేల మీద కూర్చున్నారు.ఒకమ్మాయి ఒక తాడు పట్టుకుని లాగుతోంది.ఆ తాడు ఇంకో చివర ఒక ఇటుక రాయికి కట్టారు.మరో అమ్మాయి ముందు ఒక బండరాయి పెట్టుకుని, దాని కింద ఎండు మిరపకాయలు( Dried chilies ) సర్దుతోంది.
మొదటి అమ్మాయి తాడు లాగగానే ఇటుకరాయి పైకి కిందకి ఊగుతూ సీసా బల్లలాగా తయారైంది.దాంతో ఆ ఇటుకరాయితో మిరపకాయల్ని దంచేస్తున్నారు.
ఐడియా మాత్రం అదిరింది కదూ అని ఎవరికైనా అనిపిస్తుంది.

వీడియో పోస్ట్ చేశారో లేదో, రెండు రోజుల్లోనే 22 లక్షల మంది చూసేశారు.వేలల్లో కామెంట్లు వచ్చాయి.కానీ చాలామందికి ఇది నచ్చినట్టు లేదు.“చట్నీ చేయడానికి రాతిని అరగదీస్తారు కానీ కారం కాదు” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఈ చట్నీ రెడీ అయ్యేసరికి నా మనవళ్లు పుడతారు” అని ఇంకొకరు పంచ్ వేశారు.“మీ తెలివితేటలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే” అంటూ ఇంకొందరు నవ్వేశారు.

ఇంకొందరైతే మరీ సీరియస్ అయిపోయారు.“జీవితాంతం మసాలాలు దంచుకుంటూనే ఉంటారు” అని ఒకరంటే, “ఇదెక్కడి వేస్ట్ ఐడియా” అని ఇంకొకరు తిట్టేశారు.ఏమో మరి, ఈ పద్ధతి ఎంతవరకూ పనికొస్తుందో గానీ, ఇంటర్నెట్‌కి మాత్రం మంచి కామెడీ పీస్ దొరికింది.జనాలు మాత్రం బాగా నవ్వుకుంటున్నారు.







