5వ అంతస్తు నుంచి వాషింగ్ మెషీన్ జారవిడిచిన వ్యక్తి.. తర్వాతేమైందో చూస్తే కడుపుబ్బ నవ్వుతారు!

బెర్లిన్‌లో జరిగిన ఒక వింత స్టంట్ చూస్తే మీ కడుపు చెక్కలవ్వడం ఖాయం.ఒక వ్యక్తి ఏకంగా ఐదో అంతస్తు నుంచి వాషింగ్ మెషీన్‌ను(Washing machine) కింద పరుపు మీదకు జారవిడిచాడు.

 The Man Who Dropped A Washing Machine From The 5th Floor... What Happened Next W-TeluguStop.com

అది మెత్తగా దిగుతుందని అతగాడు అనుకున్నాడు కానీ, గురుత్వాకర్షణ మాత్రం వేరే ప్లాన్ వేసింది.ఫలితం మాత్రం అతడు కలలో కూడా ఊహించనిది అని చెప్పుకోవచ్చు.

అసలు ప్లాన్ ఏంటంటే, వాషింగ్ మెషీన్‌ను (Washing machine)జారవిడవడం, అది పరుపు మీద పడి సురక్షితంగా దిగుతుందని అనుకున్నాడు.బహుశా రబ్బర్ బంతిలా బౌన్స్(Maybe bounce like a rubber ball) అవుతుందనుకున్నాడేమో కానీ ఫిజిక్స్ మాత్రం వేరే స్క్రిప్ట్ రాసింది.

అనుకున్నట్టుగా మెత్తగా దిగడం కాదు కదా, వాషింగ్ మెషీన్ పరుపుకు తగిలి, విచిత్రంగా బౌన్స్ అయ్యి నేరుగా నేలకేసి పడింది.భారీ శబ్దంతో మెషీన్ ముక్కలు ముక్కలైపోయింది.

సాఫ్ట్ ల్యాండింగ్ ఎక్స్ పెక్ట్ (Soft landing expected)చేసిన అతగాడు మాత్రం షాక్ తింటాడు.

ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారో లేదో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.జనాలు చూసి నవ్వులు ఆపుకోలేక పోతున్నారు.కామెంట్ సెక్షన్ కామెడీ క్లబ్‌లా మారిపోయింది.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.“వాషింగ్ మెషీనే స్వయంగా స్టంట్ చేయడానికి డిసైడ్ అయినట్టుంది.” అని పంచ్ వేస్తే.మరొకరు “ఆ పరుపు అక్కడ ఎందుకో తెలుసా.వాషింగ్ మెషీన్‌కు మానసిక ధైర్యం ఇవ్వడానికి.” అంటూ సెటైర్ వేశారు.

వాషింగ్ మెషీన్ పూర్తిగా నాశనమైనా.ఆ వ్యక్తి మాత్రం అనుకోకుండా ఫేమస్ అయ్యాడు.అతని ప్లాన్ బెడిసి కొట్టి ఉండొచ్చు కానీ.ఇంటర్నెట్‌కు మాత్రం ఈ ఏడాదిలోనే బెస్ట్ కామెడీ వీడియో ఒకటి దొరికింది.నవ్వించడమే అతని లక్ష్యమైతే అతడి మిషన్ సక్సెస్ అయింది.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కు వెయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube