హిందూమతంలో చాలామంది ఎంతో భక్తితో పూజించే దేవుళ్లలో శ్రీరామచంద్రుడు ఒకరు.శ్రీరాముడి అనుగ్రహం ఉంటే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు.
అయితే అలాంటి శ్రీరాముడిని ( Lord Rama )పూజించే సమయంలో నియమనిష్టాలు పాటిస్తూ పూజ చేయాలి.ఎవరైతే ఆ నియమనిష్టాలు పాటించి ఈ విధంగా శ్రీరాముడిని పూజిస్తారో వాళ్లకు కచ్చితంగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే శ్రీరాముడిని శనివారం రోజున పూజించడం వలన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది.
ఇక ఆయన జాతకం ప్రకారం జాతకంలో ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండడం గమనార్హం.అలాగే పూజా మందిరంలో రాముని జాతకాన్ని ఉంచి పూజిస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.పూజా మందిరంలో శ్రీ రాముని జాతకం ఉంచితే జాతక పరంగా ఉండే దోషాలు తొలగిపోతాయి.
ఇక శనివారం రోజున రావి చెట్టు( Sacred fig ) దగ్గర నీటిలో పాలతో పాటు చక్కెర కలిపి నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు.ఇక రామున్నీ శనివారం రోజున ఆయన పేరును కాగితంపై రాసి ఆ కాగితాన్ని పిండితో కలిపి శని దోషాలను దూరం పెట్టవచ్చు.
ఈ పిండిని గుళికలుగా చేసి చేపలకు తినిపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.ఈ విధంగా రాముడిని పూజించడం వలన శని దోషాలతో పాటు శని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి.అలాగే జీవితంలో శని దోషాలు తొలగిపోయి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలకు సులువుగా నివారణ దొరుకుతుంది.అలాగే రుణ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ జాగ్రత్తలను పాటిస్తూ తమ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను చెక్ పెట్టవచ్చు.
అయితే శ్రీరాముడిని చాలా భక్తి శ్రద్ధతో పూజించాలి.అప్పుడే మీకు మంచి ఫలితాలు ఉంటాయి.