హిందువులలో చాలామంది శివుడిని ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే.దేశంలోని ఎన్నో ముఖ్య ప్రాంతాలలో శివుడికి దేవాలయాలు ఉన్నాయి.
అయితే ఒక ఆలయంలో మాత్రం శివుడిని దొంగ మల్లన్న( Donga Mallanna ) అని పిలుస్తారు.ఈ ఆలయానికి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉండగా ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించారు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఈ ఆలయంలోని శివుడిని భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు.
ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులు భావిస్తారు.
ఇద్దరు దొంగలు( Two Thieves ) కేవలం ఒకే ఒక్క రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.జగిత్యాల జిల్లాలోని ( Jagityala )గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ఈ ఆలయం ఉంది.
భక్తుల కోర్కెలను తీర్చే భోళా శంకరుడి ఆలయం దగ్గర నిర్వహించే జాతరను చూడటానికి రెండు కళ్లు చాలవు.ఇద్దరు దొంగలు ఒక ఊరిలో ఆవులను దొంగలించగా ఆ విషయం గ్రామస్తులకు తెలియకుండా తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామని దొంగలు శివ లింగాన్ని మొక్కుకున్నారు.
కొంత సమయానికి గ్రామస్తులు దొంగలు ఆవులను( Cows ) దొంగలించారని గుర్తించగా ఆ సమయంలో ఆవుల రంగు మారిపోవడంతో గ్రామస్తులు వెనక్కు వెళ్లిపోయారు.ఆ తర్వాత దొంగలు తమకు నచ్చిన రీతిలో ఆలయాన్ని( Temple ) నిర్మించారు.ఆ తర్వాత రోజుల్లో రాజులు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.స్వామికి బోనాలు సమర్పించి రంగవల్లికలు వేస్తే కోరిన కోరికలు తీరతాయని చాలామంది నమ్ముతారు.
కొండూరు వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి.తెలంగా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటారు.జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.ఈ ఆలయంలో శివుడితో పాటు ఇతర దేవతామూర్తులను సందర్శించవచ్చు.ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండగా కొత్త కుండలో కొత్త పంటతో బోనం చేసి పూజిస్తే కోరిన కోరికలు తీరతాయని చాలామంది విశ్వసిస్తారు.