జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల అంశంపై మంత్రి ఉత్తమ్ చర్చిస్తున్నారని తెలుస్తోంది.అలాగే రెండో పంటకు సాగునీరు ఇచ్చే అంశంలో అందుబాటులో ఉన్న నీరు ఎన్ని ఎకరాలకు అందించగలమనే అంశాలపై చర్చించనున్నారు.
సమావేశం ముగిసిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.అయితే బీఆర్ఎస్ పాలనలో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే.