ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలకు( Tirumala ) పుణ్యక్షేత్రానికి ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇలాంటి సామాన్య భక్తుల కోసం పది ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను ( Free electric buses )తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ ( Y.V.Subbareddy ) ఈ బస్సులను ప్రారంభించారు.మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్( Olectra Green Tech Limited )’ సంస్థ ఈ బస్సులను తయారు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ సమీపంలోని ప్లాంట్ లో ఈ బస్సులను తయారుచేసి టిటిడి కి కానుకగా అందజేసింది.
తిరుమల కొండపై ఇప్పటికే ధర్మ రథం పేరుతో డిజిటల్ బస్సులు భక్తుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నాయి.కొండ పై బస్టాప్ సత్రాల నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకునేందుకు భక్తులు ఈ బస్సులను వినియోగించుకుంటున్నారని చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.వీటికి అదనంగా 10 బస్సులు మొదలుపెట్టారు.
అత్యాధునిక సంకేతికత ఈ బస్సులను తయారు చేశారు.మొత్తం 18 కోట్ల విలువచేసే పది బస్సులను టీటీడీకి ఒలెక్ట్రా కంపెనీ విరాళంగా అందజేసిందని, ధర్మ రధాల పేరుతో సామాన్య భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన డీజిల్ బస్సుల స్థానంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు.
అంతే కాకుండా తిరుమలలో పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సంవత్సరం కిందటే ప్రారంభించామని వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు.సీఎం జగన్ చొరవతో 65 ఎలక్ట్రిక్ బస్సులను ఏపీ ఆర్టీసీ ప్రతి రోజు తిరుపతి తిరుమల మధ్య నడుపుతుందని వెల్లడించారు.