హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో హనుమాన్ జయంతి ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.వాయు పుత్రుడు ఆంజనేయుడు పుట్టినరోజు సందర్భంగా హిందువులు ఈ పండుగను జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం హనుమాన్ చైత్ర పౌర్ణమి రోజు జన్మించాడు.అందుకే ఈ రోజున హనుమాన్ జయంతి( Hanuman Jayanti ) పేరుతో పండుగ జరుపుకుంటారు.
భారీ ఎత్తున ర్యాలీలు, శోభయాత్ర నిర్వహిస్తూ పవన సుధుడిని ఆరాధిస్తారు.అయితే ఈ మధ్యకాలంలో పండుగకు సంబంధించి కొన్ని కొత్త కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి.
అలానే హనుమాన్ జయంతి సందర్భంగా ఒక కొత్త వివాదం తెర మీదకు వచ్చింది.అది ఏమిటి అంటే సాధారణంగా మన దగ్గర చనిపోయిన వారి పుట్టినరోజును జయంతి వేరుతో సంబోధిస్తారు.
మరి ఆంజనేయుడు చిరంజీవి కదా? ఆయన జన్మదినన్ని జయంతి అని పిలవడం తప్పు కదా అని కొంతమంది చెబుతూ ఉన్నారు.పురాణాల ప్రకారం మన దేవుళ్లలో చాలా మంది లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ఎత్తి రాక్షసులను నిర్మూలించి, ధర్మాన్ని కాపాడి ఆ తర్వాత అవతార పరిసమాప్తి చేశారు.

రాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి ఇలా దశావతారాలు ధర్మసంస్థాపన కోసం జరిగినవే అని నిపుణులు చెబుతున్నారు.ఆయా అవతారాల లక్ష్యం పూర్తి కాగానే పరిసమాప్తి జరిగింది.కాబట్టి ఆయా దేవుళ్ళ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఇలా జయంతి అని ఉపయోగించవచ్చు.దానిలో తప్పులేదు అని కొంతమంది చెబుతున్నారు.కానీ ఆంజనేయుడు అలా కాదు కదా.ఆయన చిరంజీవి భూమి అంతమయ్యే వరకు ఆయన బ్రతికే ఉంటాడు.మరి అలాంటప్పుడు హనుమాన్ జన్మదిన వేడుకలను చనిపోయిన వారికి సంబంధించి జయంతిని ఉపయోగించడం ఎంత వరకు కరెక్ట్ అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు.