తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఖమ్మం జిల్లాలో( Khammam District ) జరిగిన బీఆర్ఎస్ కార్యకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ( Congress ) ప్రకటించనవి అన్నీ మోసపూరిత హామీలేనని హరీశ్ రావు విమర్శించారు.ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ చెప్పేవన్నీ బోగస్ మాటలేనన్న హరీశ్ రావు ఒక్కదానిలో కూడా నిజం లేదన్నారు.ఆరు గ్యారెంటీల పేరుతో( Six Guarantees ) కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.
మాట ఇచ్చి తప్పడం కాంగ్రెస్ కు అలవాటేనన్న ఆయన కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పారు.ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు.