ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పై తీర్పు రిజర్వ్ అయింది.ఈ మేరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) మే 6వ తేదీన తీర్పును వెలువరించనుంది.
లిక్కర్ కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే సీబీఐ( CBI ) కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం మే 2వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది.
ఇక ఈడీ( ED ) కేసులో సుదీర్ఘ వాదనలు జరగగా.కవితకు బెయిల్ ఇస్తే ఆమె కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలోనే కవిత సాక్షులను, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టుకు తెలిపింది.ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
.