అప్పట్లో తెలుగు సినిమా అంటే అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిలా కళకళ లాడుతూ ఉండేది.అప్పట్లో ANR, NTR, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలతో పాటు సావిత్రి, జామున, భానుమతి లాంటి హీరోయిన్స్ తెలుగుతనానికి ప్రతికలుగా ఉండేవారు.
భానుమతి అయితే స్వతహాగా కవయిత్రి.అచ్చమైన తెలుగు భాషలోనే మాట్లాడేది.
ఇంకా చెప్పాలంటే తన పాట తానే రాసుకుని, పడుకుని ప్రేక్షకులని మెప్పించేది.ఇక ఎన్టీఆర్ సంగతి అయితే చెప్పక్కర్లేదు తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం ఆయన.ఆయన కథలను ఆయన రాసి దర్శకత్వం వహించి, బహు భాషా చిత్రాలలో నటించారు.అలాగే నాగేశ్వరావు గారు, కృష్ణ గారు కూడా తెలుగు బాగా మాట్లాడేవారు.
అలాంటి ఎంతోమంది తెలుగుదేశం బాష పండితులు ఉన్న మన తెలుగు ఇండీస్ట్రీ ఇప్పుడు ఎటు వెళ్తుందో తెలియడం లేదు.ప్రస్తుతం తెలుగు తనానికి పుట్టినిల్లు అయిన తెలుగు ఇండస్ట్రీలోని నటించే కథానాయకులు అంతా వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే.
వీరికి తెలుగు బాష రాదు.కానీ ఎలాగోలా మేనేజ్ చేస్తున్నారు.
ఎందుకంటే వాళ్లు మన ప్రాంతానికి చెందిన వారు కాదు కాబట్టి.కానీ మన ప్రాంతానికి చెందిన వారు అయి ఉండి, అసలు తెలుగు మాట్లాడం రానివారు కూడా ఉన్నారు అంటే ఆలోచించండి.
వాళ్లు ఎవరో ఏంటో చూద్దాం ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉండే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తారు.సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.

కానీ కృష్ణ మాట్లాడిన విధంగా తెలుగులో మహేష్ బాబు మాట్లాడలేరు.అక్షరం ముక్క తెలుగు రాదు.ఆయన చెప్పాలనుకున్న డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్ లో రాసుకుని తెలుగులో చెప్తారట.ఇక మహేష్ బాబు భార్య ఎదో పక్కా రాష్ట్రంలో పుట్టిన అమ్మాయి కాబట్టి తెలుగు రాదు అంటే సరిపెట్టుకోవచ్చు.
కాని మహేష్ కి ఏమైంది తెలుగు బాష కే గర్వకారణం అయిన కృష్ణ గారి కడుపున పుట్టి తెలుగు రాకపోవడం ఏంటి అన్న ప్రశ్న ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.అలాగే తెలుగు రాని నటీమణులలో జయసుధ గారు కూడా ఒకరు.
ఈమెకి సహజ నటి అని బిరుదు కూడా కలదు.తెలుగు కథానాయిక లోనే అగ్ర కథానాయిక జయసుధ.
అలాగే ఒక నాటి తెలుగు కథానాయికలలోనే అగ్ర కథానాయిక జయసుధ.కానీ ఈవిడకి తెలుగు అక్షరం ముక్క రాదు.అవును నిజంగానే ఈవిడకి తెలుగు రాదు.సినిమాల్లో నటించే అప్పుడు ఈవిడకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వలన ఒకసారి చెప్పిన డైలాగు ఠక్కున మళ్ళీ చెప్పేది.
ఇప్పుడు వయసు మీద పడడంతో జ్ఞాపక శక్తి తగ్గడంతో ప్రోమ్ప్టింగ్ అడుగుతుందట.

ఇకపోతే మంచు లక్ష్మి విషయానికి వస్తే ఈవిడ స్టైలే వేరు.మంచు వారింట పుట్టి అసలు తెలుగు రాని నటి.తెలుగును టెన్ గ్లీష్ గా మార్చిన ఘనత ఈవిడది.తెలుగులో మంచు లక్ష్మి బాష ఒకటి అంటూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది.మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు ఏమో దాదాపు 500 చిత్రాల్లో నటించాడు.
అలాగే డైలాగ్ చెప్పడంలో దిట్ట.అందుకనే ఈయన కి డైలాగ్ కింగ్ అనే పేరు కూడా వచ్చింది.
తండ్రి కడుపున పుట్టిన లక్ష్మి తండ్రి పేరే కాదు తెలుగు బాషని కూడా కూని చేస్తుంది.అలాగే అక్క బాటలోనే తమ్ముళ్లు కూడా నడుస్తున్నారు.
మంచు విష్ణు అయితే తన పేరు కూడా తాను తెలుగులో రాసుకోలేడు.అసలు తెలుగు మాట్లాడాలంటే కొన్ని పదాలు నోరు కూడా తిరగవు.
మంచు మనోజ్ కూడా అంతే తెలుగు సరిగా మాట్లాడలేడు.మొత్తానికి తెలుగు బాష పండితుడు మోహన్ బాబు ముగ్గురు సంతానం కూడా తెలుగు మాట్లాడలేకపోవడం గమనార్హం.
అలాగే మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు.తెలుగు రాదు.
కానీ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుని మాట్లాడగలుగుతున్నాడు.

ముంబాయి హీరోయిన్ల కంటే రామ్ చరణ్ చాలా బెటర్.అలాగే అక్కినేని వారి మనవడు అఖిల్ కూడా ఇదే పరిస్థితి.తెలుగు అసలు రాదు.
తెలుగు రాష్ట్రంలో పుట్టాడు కాబట్టి పక్కన వాళ్లు ఇంట్లో వాళ్లు తెలుగు మాట్లాడుతుంటే అలా ఎదో కొంచెం మాట్లాడుతున్నాడు అంతే.ఎంత పెద్ద డైలాగ్ అయినాగానీ ఇంగ్లీష్ లో రాసుకుని తెలుగులో చదువుతాడు అంతే.
అలాగే ఇలా ఒకరిద్దరు కాదు.
మన తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు పరాయి బాష హీరోయిన్స్ ఉన్నారు.
అసలు తెలుగు రాదు ఒకవేళ వచ్చినాగాని వచ్చి రానట్టు మాత్రమే తెలుగు మాట్లాడతారు.ఎందుకంటే ఇప్పుడు అలా మాట్లాడితేనే ఫ్యాషన్ కదా మరి.అలాగే హీరోల్లో కొంతమందికి తెలుగు రాదు.తెలుగు వచ్చిన వారిని వేళ్ళల్లో లెక్కపెట్టవచ్చు.
అలాగే వీళ్ళందరూ ప్రకాష్ రాజ్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి.ఎందుకంటే ప్రకాష్ రాజ్ కర్ణాటకలో పుట్టినాగాని పట్టుబట్టి మరి తెలుగు నేర్చుకున్నాడు.
నిజంగా ప్రకాష్ రాజ్ గ్రేట్ కదా.