జలుబు సమస్య తీవ్రంగా వేధిస్తోందా.? దాని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.? జలుబు నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతున్నారా.? అయినా సరే జలుబు మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి .ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే జలుబు ఎంత తీవ్రంగా ఉన్నా సరే రెండు రోజుల్లోనే పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా అంగుళం అల్లం ముక్క( Ginger ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి మెత్తగా దంచి పెట్టుకోవాలి.అలాగే చిన్న ఉల్లిపాయ( Onion )ను తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దంచి పెట్టుకున్న అల్లం వేసి నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజుకు రెండు సార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే అందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ జలుబును సమర్థవంతంగా నివారిస్తాయి.
ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎలాంటి జలుబు అయినా రెండు రోజుల్లోనే పరార్ అవుతుంది.కాబట్టి జలుబు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.పైగా దగ్గు సమస్యను వదిలించడానికి కూడా ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే రోగ నిరోధక వ్యవస్థ సైతం బలపడుతుంది.దాంతో వివిధ రకాల జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.