మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తున్నప్పుడు ఆ శుభకార్యంలో అరటికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము.అయితే ఈ అరటి ప్రాముఖ్యతను పూజా విధానాన్ని రామాయణంలోనే భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు తెలుస్తోంది.
మాఘ చతుర్థశి రోజు ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసే అరటి పిలకకు లేదా మన పెరటిలో ఉన్న అరటి చెట్టుకు పూజలు నిర్వహించాలి.అరటి చెట్టుకు పసుపు, కుంకుమలతో, పువ్వులతో అందంగా అలంకరించి అరటి పూజను ప్రారంభించాలి.
ఈ అరటి కాండానికి దీప, దూప, నైవేద్యం ప్రసాదించాలి.ధూపానంతరం పెసర పప్పు, బెల్లం, 14 తులసి ఆకులలో నైవేద్యంగా సమర్పించాలి.అదే రోజు మధ్యాహ్నం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టి, వారికి తాంబూలంగా అరటి దవ్వ, అరటి పండ్లను దానం ఇవ్వాలి.అయితే ఈ విధంగా అరటి పూజ చేసిన వారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు.
ఉపవాసంతోనే ఈ పూజను నిర్వహించాలి.సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయాలి.
ఈ విధంగా అరటి పూజ చేయటం వల్ల వారికి సంతానం కలిగి ఆ సంతానం ఉన్నత స్థాయిలో ఉంటుందని, రామాయణంలో కూడా శ్రీరామచంద్రుల చేత భరద్వాజమహర్షి ఈ పూజలు జరిపినట్లు తెలుస్తోంది.

శ్రీరాముడు సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమంలో విడిది చేశారు.శ్రీరాముడు తమ రాకను భరతుడికి చేరవలసిందిగా హనుమంతునికి చెప్పాడు.హనుమంతుడు భరతుడు ఈ సమాచారం చేరవేసి తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు.
అప్పటికే అందరూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.అందరూ అరిటాకులో భోజనం చేయగా ఒక హనుమంతుడికి మాత్రమే అరటి ఆకు తక్కువగా వస్తుంది.
ఆ సమయంలో శ్రీరామచంద్రుడు హనుమంతుని గొప్పతనం అందరికీ తెలియాలని తన కుడి వైపు వచ్చి కూర్చోమని హనుమంతునికి సైగ చేశారు.ఇక భరద్వాజ మహర్షి కూడా చేసేదేమి లేక ఓకే అరటి ఆకులో హనుమంతుడికి శ్రీరామచంద్రునికి భోజనం వడ్డిస్తాడు.
భోజనం అనంతరం శ్రీరామచంద్రుడు ఈ విధంగా తెలియజేశాడు.
ఎవరైతే శ్రీరాముని పూజలో కానీ లేదా హనుమంతుని పూజలో కానీ మాకు అరటి ఆకులో అరటి పండ్లు సమర్పిస్తారో వారిపై మా ఇద్దరు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.
అదేవిధంగా జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే మా ఇద్దరికి సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానాభివృద్ధి కలిగే ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటారు అంటూ శ్రీరామచంద్రుడు తెలియజేశారు
.