అదే రోజు మధ్యాహ్నం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టి, వారికి తాంబూలంగా అరటి దవ్వ, అరటి పండ్లను దానం ఇవ్వాలి.
అయితే ఈ విధంగా అరటి పూజ చేసిన వారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు.
ఉపవాసంతోనే ఈ పూజను నిర్వహించాలి.సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయాలి.
ఈ విధంగా అరటి పూజ చేయటం వల్ల వారికి సంతానం కలిగి ఆ సంతానం ఉన్నత స్థాయిలో ఉంటుందని, రామాయణంలో కూడా శ్రీరామచంద్రుల చేత భరద్వాజమహర్షి ఈ పూజలు జరిపినట్లు తెలుస్తోంది.
"""/"/
శ్రీరాముడు సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమంలో విడిది చేశారు.శ్రీరాముడు తమ రాకను భరతుడికి చేరవలసిందిగా హనుమంతునికి చెప్పాడు.
హనుమంతుడు భరతుడు ఈ సమాచారం చేరవేసి తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు.అప్పటికే అందరూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.
అందరూ అరిటాకులో భోజనం చేయగా ఒక హనుమంతుడికి మాత్రమే అరటి ఆకు తక్కువగా వస్తుంది.
ఆ సమయంలో శ్రీరామచంద్రుడు హనుమంతుని గొప్పతనం అందరికీ తెలియాలని తన కుడి వైపు వచ్చి కూర్చోమని హనుమంతునికి సైగ చేశారు.
ఇక భరద్వాజ మహర్షి కూడా చేసేదేమి లేక ఓకే అరటి ఆకులో హనుమంతుడికి శ్రీరామచంద్రునికి భోజనం వడ్డిస్తాడు.
భోజనం అనంతరం శ్రీరామచంద్రుడు ఈ విధంగా తెలియజేశాడు.ఎవరైతే శ్రీరాముని పూజలో కానీ లేదా హనుమంతుని పూజలో కానీ మాకు అరటి ఆకులో అరటి పండ్లు సమర్పిస్తారో వారిపై మా ఇద్దరు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.
అదేవిధంగా జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే మా ఇద్దరికి సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానాభివృద్ధి కలిగే ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటారు అంటూ శ్రీరామచంద్రుడు తెలియజేశారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా మారబోతున్నారా..?