కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సుదీప్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ్, హిందీ ప్రేక్షకులకి ఇప్పటికే చేరువ అయ్యాడు.
ఈగ సినిమాలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన సుదీప్ రీసెంట్ గా చిరంజీవి సైరా సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు.ఈ సినిమాలో అతని క్యారెక్టర్ కి సంబంధించి మంచి ప్రశంసలు వచ్చాయి.
ఇక హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3లో విలన్ గా నటించి మెప్పించాడు.ఇలా అన్ని బాష ప్రేక్షకులకి చేరువ కావడంతో హీరోగా కూడా తన మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి కిచ్చా సుదీప్ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో కేజీఎఫ్ స్టార్ యష్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో సుదీప్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.
విక్రాంత్ రోణా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
అనూప్ బండారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ త్రీడీలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.అలాగే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కథాంశం ఉంటుందని సమాచారం.
కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో మరో భారీ బడ్జెట్ చిత్రంగా విక్రాంత్ రోణా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేశారు.
ఆగష్టు 19న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాలలో సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.అలాగే సౌత్ బాషలతో పాటు హిందీలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు.
మరి ఇప్పటికే యష్ కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా తనని తాను రిప్రజెంట్ చేసుకున్నాడు.మరి సుదీప్ఆ స్థాయిని ఎంత వరకు అందుకుంటాడు అనేది వేచి చూడాలి.