సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి( Akkineni Family ) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పాలి అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను అందించి తెలుగు చిత్ర పరిశ్రమకే మూల స్తంభం లాంటివారని చెప్పాలి.ఇలా అక్కినేని లెగసీని తన కుమారుడు నాగార్జున( Nagarjuna ) కంటిన్యూ చేస్తూ తండ్రి పేరును నిలబెడుతూ వచ్చారు.
ఇక నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య, ( Nagachaitanya ) అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇలా సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.ఇకపోతే ఇటీవల నాగచైతన్య నటి శోభిత( Sobhita ) ను పెళ్లి చేసుకున్నారు.సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేశారు.
ఇక వీరు పెళ్లి తర్వాత నాగచైతన్య నటించిన మొదటి చిత్రం తండేల్.( Thandel ) ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా సక్సెస్ వేడుకల్లో భాగంగా శోభిత కూడా హాజరైన విషయం తెలిసిందే .ఎంతో సంప్రదాయకంగా చీర కట్టుకొని కుంకుమ బొట్టుతో ఈమె చాలా అట్రాక్షన్ గా కనిపించారు.

పెళ్లికి ముందు ఎన్నో బోల్డ్ సినిమాలలో నటించిన శోభిత పెళ్లి తర్వాత ఇలా సాంప్రదాయానికి మారుపేరుగా నిలిచిపోయారు అయితే ఈమె వ్యవహార శైలి చూసిన అభిమానులు ఇకపై ఈమె సినిమాలలో నటించదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమా తన జీవితమని సినిమాలు వదిలే ప్రసక్తేలేదని శోభిత చెప్పకనే చెప్పేస్తున్నారు.కానీ ఈమె మాత్రం మెగా కోడలు లావణ్య( Lavanya Tripathi ) బాటలోనే పయనిస్తున్నారని చెప్పాలి.లావణ్య కూడా మెగా కుటుంబానికి తన వల్ల ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని కేవలం ఫ్యామిలీ సినిమాలు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆసక్తి చూపుతున్నారు.
అదే తరహాలోనే శోభిత సైతం కుటుంబ కథ చిత్రాలలో నటించాలని మాత్రమే భావిస్తున్నారట.అక్కినేని కుటుంబానికి చెడ్డ పేరు వచ్చేలా ఎలాంటి సినిమాలు చేయకూడదని ఈమె డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.