టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్లలో శ్వేతా బసు ప్రసాద్( Shweta Basu Prasad ) ఒకరు.తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా శ్వేతా బసు ప్రసాద్ పాపులారిటీని పెంచుకున్నారు.
కొత్త బంగారు లోకం( Kotha Bangaru Lokam ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ కెరీర్ మొదలైంది.తొలి సినిమానే సంచలన విజయాన్ని సాధించడం శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయింది.
తర్వాత రోజుల్లో శ్వేతా బసు ప్రసాద్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి.పలు వివాదాలలో చిక్కుకోవడం ద్వారా శ్వేతా బసు ప్రసాద్ పేరు వార్తల్లో వినిపించింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం శ్వేతా బసు ప్రసాద్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించారు.అయితే తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి శ్వేతా బసు ప్రసాద్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాను కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు కొన్ని ఉన్నాయని ఆమె అన్నారు.ప్రధానంగా ఒక తెలుగు సినిమా సెట్లో తాను అసౌకర్యానికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు.హీరోతో పోల్చి చూస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని ప్రతి ఒక్కరూ ఎగతాళి చేశారని హీరో ఆరడుగులు ఉంటే నేను ఐదడుగులు మాత్రమే ఉన్నానని అన్నారని శ్వేతా బసు ప్రసాద్ వెల్లడించడం గమనార్హం.

ఆ హీరో వల్ల కూడా చాలా ఇబ్బంది అయిందని ఆ హీరో ప్రతి సీన్ మార్చేశేవాడని ఆమె తెలిపారు.ఆ హీరో తెలుగు వాడే అయినా తెలుగులో డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోయాడని ఆమె చెప్పుకొచ్చారు.ఎత్తు అనేది వారసత్వంగా వస్తుందని అందుకు నేనేం చేయగలనని శ్వేతా బసు ప్రసాద్ తెలిపారు.
శ్వేతా బసు ప్రసాద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.