కొబ్బరికాయ జుట్టు లేకుండా దేవుడికి కొట్టకూడదా..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగిన సమయంలో లేదా పూజా కార్యక్రమాలలో కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఇలా పూజ అనంతరం ఆ భగవంతుడికి కొబ్బరికాయను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

 Coconut Should Not Hit God-without Hair Coconut, God, Worship, Hindu Belives, Hi-TeluguStop.com

ఈ క్రమంలోనే దేవుడికి కొబ్బరికాయలు కొడుతుంటారు.అయితే కొబ్బరికాయను పిలకతో కొట్టడం వల్ల కొబ్బరికాయకు ప్రాధాన్యత ఉంటుంది.

అందుకే కేవలం పిలక ఉన్న కొబ్బరికాయలు కొట్టడం మనం చూస్తుంటాము.అయితే జుట్టు లేకుండా కొబ్బరికాయ దేవుడికి కొట్టకూడదని చాలా మంది చెబుతుంటారు.

అసలు అలా ఎందుకు కొట్టకూడదు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా కొబ్బరికాయనుమన ఆత్మ స్వరూపంగా భావించి మనలో ఉన్నటువంటి ఆహారాన్ని తొలగిస్తూ దేవుడికి కొబ్బరికాయలు కొడతారు.

కొబ్బరికాయలు సాక్షాత్తు మనిషి స్వరూపంగా భావిస్తారు.కొబ్బరికాయ పైన ఉండే పీచును మన శరీరంగా భావిస్తారు.

దృఢంగా గా ఉండే చిప్ప మన ఎముకలు అందులో ఉండే నీరు ప్రాణాధారం పైన ఉన్న మూడు కన్నులు ఇడ, పింగళ, సుషుమ్న నాడులు.జుట్టు అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక.

Telugu Coconut, Hindu, Worship-Latest News - Telugu

అందుకోసమే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ కొబ్బరికాయ కొట్టాలి.అందుకోసమే కొబ్బరికాయలు కొట్టే టప్పుడు తప్పనిసరిగా జుట్టుతోనే కొట్టాలని పండితులు చెబుతున్నారు.పురాణాల ప్రకారం పరమేశ్వరుడు త్రిపురాసుర అనే రాక్షసుడిని చంపడానికి వెళ్ళినప్పుడు గణపతి ఆజ్ఞమేరకు మూడు కళ్ళు జుట్టులా శిరస్సు ఉన్న కొబ్బరికాయలు సృష్టించి వినాయకుడికి సమర్పించాడని పురాణాలు చెబుతున్నాయి.అందుకోసమే దేవుడికి టెంకాయ సమర్పించేటప్పుడు తప్పనిసరిగా పిలక ఉన్న కొబ్బరికాయలు కొట్టినప్పుడే పూజ సంపూర్ణం అవుతుంది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube