మన హిందూ సంప్రదాయంలో యజ్ఞోపవీతమునకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

యజ్ఞోపవీతము బ్రహ్మ తత్వమును సూచించుటచే బ్రహ్మ సూత్రమనే పేరు వచ్చింది.వేదాలలోని మూడు సూత్రములను గ్రహించిన బ్రహ్మ వాటిని ఒక సూత్రంగా తయారుచేశాడు.

 What Is The Significance Of Remembrance In Our Hindu Tradition ,  Hindu Traditi-TeluguStop.com

విష్ణువు ఆ సూత్రమును రెట్టింపు చేయగా, శివుడు దానిని గాయత్రిచే అభిమంత్రించి బ్రహ్మ గ్రంధి చేశాడు.త్రిమూర్తుల కారణంగా 9 పోగుల యజ్ఞోపవీతం తయారు చేయబడింది.

అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది.

యజ్ఞోపవీతంలో ఉండే ఈ తొమ్మిది పోగులలో బ్రహ్మ … అగ్ని … అనంతుడు … చంద్రుడు … పితృదేవతలు … ప్రజాపతి … వాయువు … సూర్యుడు … సర్వదేవతలు నివసిస్తుంటారు.

అయితే బ్రహ్మచారులు ధరించే యజ్ఞోపవీతమునకు పెళ్లి అయిన వారు ధరించే యజ్ఞోపవీతమునకు తేడా ఉంటుంది.అలాగే శైవులు … వైష్ణవులు ధరించే యజ్ఞోపవీతంలోను కొన్ని తేడాలు ఉంటాయి.

ఇంకా యజ్ఞోపవీతం విషయానికి వస్తే నాభికి తక్కువ ఎక్కువ కాకుండా సమానంగా ఉంటుంది.యజ్ఞోపవీతం ధరించిన వారు పితృ … గురు రుణాలను తీర్చుకొనే అవకాశాన్ని కలిగి ఉంటారు.

యజ్ఞోపవీతం ధరించినవారు ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపాలని పురాణాలు చెపుతున్నాయి.

What Is The Significance Of Remembrance In Our Hindu Tradition , Hindu Tradition , Remembrance , Significance , Significance Of Remembrance In Our Hindu Tradition , Vishnu , Brahma , Lord Shiva - Telugu Brahma, Hindu, Lord Shiva, Remembrance, Significance, Vishnu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube