పలువురు తెలుగు హీరోలు బాలీవుడ్ లోనూ సత్తా చాటారు.పదుల సంఖ్యలో హిందీ సినిమాలు చేశారు.
అయితే తెలుగు జనాలకే కాదు.బాలీవుడ్ సినీ అభిమానులకు నాగార్జున, వెంకటేష్ బాగా పరిచయం.
అటు రాశీ ఖన్నా, నిధి అగర్వాల్ సైతం కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు.ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న నలుగురు టాలీవుడ్ నటుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*వెంకటేష్వెంకటేష్ ఇప్పటి వరకు 75 సినిమాలు చేశాడు.వాటిలో చాలా సినిమాలు రీమేక్స్ ఉన్నాయి.బాలీవుడ్ లో రీమేక్ తో తొలి అడుగు వేశాడు.18991లో వచ్చిన తమిళ సినిమా చిన్న తంబి.ఇదే తెలుగులో చంటి సినిమాగా వచ్చింది.హిందీలో అనాడీ పేరుతో రీమేక్ చేశారు.అక్కడ కూడా వెంకటేష్ హీరోగా చేశాడు.1993లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దాదాపు 27 ఏండ్ల తర్వాత వెంకీ మరో బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు.సల్మాన్ ఖాన్, వెంకీ హీరోలుగా ఫర్హాద్ సామ్‌జీ ఓ యాక్షన్ కామెడీ ఫిల్మ్ తీస్తున్నాడు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
*నాగార్జునహిందీలో పదికి పైగా సినిమాలు చేశాడు నాగార్జున.2003లో వచ్చిన ఎల్‌ఓసీ: కార్గిల్ లో కీలక పాత్ర పోషించాడు.ఆ తర్వాత ఆయన బాలీవుడ్ లో మరో సినిమా చేయలేదు.
తాజాగా ఆయన నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు రెడీ అయ్యింది.నాగార్జున ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు.
అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లు.అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా కీ రోల్స్ చేస్తున్నారు.

*రాశీ ఖన్నాబొద్దుగుమ్మ రాశీ ఖన్నా సైతం 8 ఏండ్ల తర్వాత బాలీవుడ్ సినిమా చేస్తుంది.2013లో వచ్చిన హిందీ చిత్రం మద్రాస్ కేఫ్ తర్వాత యోధ అనే హిందీ సినిమా చేస్తుంది.సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాగర్ అమ్రే, పుష్కర్ ఓజా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో దిశా పటానీ మరో హీరోయిన్.నవంబరు 11న విడుదల కానుంది.

*నిధి అగర్వాల్హిందీ సినిమాతోనే హీరోయిన్ గా మారింది నిధి.2017లో వచ్చిన మున్నా మైఖేల్ తో తొలిసారి హీరోయిన్ గా కనిపించింది తాజాగా మరో సినిమాతో బాలీవుడ్ లో దర్శనం ఇవ్వబోతుంది.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తర్వలో వెల్లడికానున్నాయి.