నాన్ వెజ్ లవర్స్ కు రొయ్యలను( Prawns ) పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రొయ్యలకు రెండు రకాలుగా లభ్యం అవుతుంటారు.
ఒకటి పచ్చి రొయ్యలు( Fresh Prawns ) కాగా.మరొకటి ఎండు రొయ్యలు.
( Dried Prawns ) ఇవి రెండు తమదైన ప్రయోజనాలు, రుచులను కలిగి ఉంటాయి.అయితే ఆరోగ్య పరంగా ఎండు రొయ్యలు మరియు పచ్చి రొయ్యల్లో ఏది బెస్ట్ అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.
సాధారణంగా పచ్చి రొయ్యలు స్వచ్చమైన, తాజా రుచిని కలిగి ఉంటాయి.సాఫ్ట్‌గా ఉంటాయి.ఫ్రై, గ్రేవీ, బిర్యానీ, కర్రీలకు పచ్చి రొయ్యలు అనువుగా ఉంటాయి.అలాగే ఎండు రొయ్యలు పొడిగా ఉండి, నిల్వ చేయడానికి సులభంగా ఉంటాయి.
ఇవి కర్రీలు, పులుసులు, పొడులు మరియు స్నాక్స్‌కు అద్భుతంగా ఉంటాయి.ఆరోగ్య పరంగా చూస్తే.
పచ్చి రొయ్యలు అధికంగా ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది శరీర నిర్మాణానికి మరియు కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.పచ్చి రొయ్యల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మంచివి, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
ఎండు రొయ్యల కంటే ఉప్పు తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవారికి పచ్చిరొయ్యలు మంచివి.

ఎండబెట్టిన రొయ్యల విషయానికి వస్తే.ఇవి కీళ్ల ఆరోగ్యానికి, ఎముకల బలానికి ఉత్తమంగా సహాయడతాయి.అయితే ఎండబెట్టే సమయంలో ఎక్కువ ఉప్పు వేసే అవకాశం ఉంటుంది, అందువల్ల హైబీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎండు రొయ్యలు మంచిది కాదు.
పైగా ఎండు రొయ్యల్లో పోషకాలు కొంత తగ్గవచ్చు.ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు రెండింటినీ పరిమితంగా తీసుకోవచ్చు.

ఒకవేళ హైబీపీ, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే పచ్చి రొయ్యలను ఎంపిక చేసుకోవాలి.ఇక చివరి మాట ఏంటంటే.ఎండు రొయ్యలతో పోలిస్తే పచ్చి రొయ్యలే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి.ఆరోగ్య పరంగా పచ్చి రొయ్యలు బెస్ట్.కాకపోతే పచ్చి రొయ్యలు త్వరగా పాడైపోతాయి, అందుకే నిల్వ చేయడం కష్టం.నిల్వ చేయడానికి ఫ్రీజింగ్ కచ్చితంగా అవసరం.