అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.( President Donald Trump ) ఇప్పటికే దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను పెద్ద ఎత్తున అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు.
అలాగే హెచ్ 1 బీ వీసాల( H1-B Visa ) విధానంలోనూ సంస్కరణలు తీసుకొస్తున్నారు ట్రంప్.తాజాగా కొన్ని గ్రీన్ కార్డ్ దరఖాస్తులను( Green Card Applications ) ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిలిపివేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ట్రంప్ సంతకం చేసిన రెండు కార్యనిర్వాహక ఉత్తర్వుల కారణంగా స్టేటస్ దరఖాస్తుల సర్దుబాటు అని పిలవబడే కొన్నింటిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారి ఒకరు అన్నారు.

దీనిపై నేషనల్ ఇమ్మిగ్రెంట్ జస్టిస్ సెంటర్ డైరెక్టర్ ఆఫ్ పాలసీ ఆజాదే ఎర్ఫానీ మీడియాతో మాట్లాడుతూ.గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌పై ఈ భారీ నిరవధిక నిలిపివేత అన్ని రకాల వలసదారులను జాతీయ భద్రతా ప్రమాదంగా చిత్రీకరించడానికి ట్రంప్ పరిపాలన యంత్రాంగం చేస్తున్న మరో ప్రయత్నం అన్నారు.ఈ విరామం వల్ల వేల మంది దరఖాస్తుదారులకు శాశ్వత నివాసం కోసం మరింత సమయం వేచి ఉండాల్సి రావొచ్చు.
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే లక్షలాది మంది అక్రమ వలసదారులను( Illegal Migrants ) బహిష్కరిస్తానని ట్రంప్ శపథం చేశారు.వాస్తవానికి నేర చరిత్ర లేని వ్యక్తులను కూడా చేర్చి ఈ సంఖ్యను మరింత పెంచవచ్చని కొంతమంది న్యాయవాదులు భయపడుతున్నారు.

ఈ పరిణామాలు భారతీయ వలసదారులతో సహా అనేక మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వలసదారులకు మూలం భారతదేశమే.2023 నాటికి 2.9 మిలియన్లకు పైగా భారతీయ వలసదారులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.అమెరికాలో 1960ల నుంచి భారతీయ జనాభా నిరంతరాయంగా, గణనీయంగా పెరిగింది.2000 నుంచి 2023 మధ్య అత్యధికంగా అమెరికాకు భారతీయ వలసలు జరిగాయని నిపుణులు చెబుతున్నారు.ఏ దరఖాస్తులు ప్రభావితమయ్యాయో, ఎంతకాలం విరామం ఉంటుందో స్పష్టత రాలేదు.అయితే శరణార్ధులు, అమెరికాలో ఆశ్రయం పొందినవారికి సంబంధించిన ప్రక్రియతో పాటు ఒక పరిశీలన జరుగుతోంది.