టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన నాగవంశీ( Producer Nagavamshi ) ఈ వారం మ్యాడ్ స్క్వేర్( Mad Square ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.
మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ నెల 28వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ మూవీ రిలీజవుతోంది.ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరితే ఆ బిల్లులన్నీ తానే కడతానని నాగవంశీ అన్నారు.మ్యాడ్ స్క్వేర్ సినిమాను పోటీ మధ్య రిలీజ్ చేస్తున్నామని బీ, సీ సెంటర్లలోనే టికెట్ రేట్లు( Ticket Rates ) పెంచామని నాగవంశీ చెప్పుకొచ్చారు.
సినిమాలకు రేటింగ్ ఇవ్వడాన్ని నేను నమ్మనని సినిమా చూసి బాగా నవ్వుకున్నానని ప్రేక్షకులు పెట్టిన డబ్బుకు తగిన సంతృప్తి పొందుతారని నమ్ముతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

అందమైన కూతురు ఉన్నవాళ్లు ఎవరూ తప్పు చేయరంటూ ఒక ప్రశ్నకు బోనీ కపూర్ గురించి నాగవంశీ వెల్లడించారు.మ్యాడ్ స్క్వేర్ మాస్ సినిమా అని గత సినిమాతో పోలిస్తే మరింత కామెడీ ఉంటుందని నాగవంశీ చెప్పుకొచ్చారు.నెల్సన్ తో సినిమాలో హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదని ఆయన కామెంట్లు చేశారు.
సిద్ధు జొన్నలగడ్డతో వేరే జానర్ సినిమా చేస్తున్నానని ఆ సినిమా సమ్మర్ కు ఉంటుందని నాగవంశీ తెలిపారు.

ఒకరోజు ముందుగానే లిమిటెడ్ గా పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని అనుకున్నామని నాగవంశీ చెప్పుకొచ్చారు.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలుకానుందని నాగవంశీ అన్నారు.బావ ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూశారో లేదో తెలియదని నార్నె నితిన్ తెలిపారు.
బావతో సాయంత్రం మాట్లాడతానని నార్నె నితిన్ వెల్లడించారు.







