పారాయణం ఎందుకు చేయాలో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ చాలీసా పారాయణం, గోవింద నామ పారాయణం చేస్తూ ఉన్నారు.అసలు పారాయణం ఎందుకు చేయాలి? పారాయణం చేస్తే ఎలా ప్రయోజనాలు కలుగుతాయి అన్నది ధర్మశాస్త్రలో సవివరంగా చెప్పడం జరిగింది.ఏకాగ్రతతో ఇష్టమైన భగవంతుడి నామాన్ని స్మరించడాన్నే పారాయణం అని అంటారు.కలియుగంలో కడతేరడానికి సులువైన మార్గం కూడా ఇదే అని చెప్పవచ్చు.జీవితంలో ఉత్తమగతులు పొందడానికి కూడా పారాయణం ఒక దివ్యమైన మార్గమని చెప్పాలి.హనుమాన్ చాలీసాను 5 లేదా 9 లేదా 11 రోజులపాటు పారాయణం చేయాలి.

 Do You Know Why To Do Parayanam , Parayanam, Devotional, Puja , Bhagavad Gita ,-TeluguStop.com
Telugu Bhagavad Gita, Bhakti, Devotional, Lord Krishna, Mahavishnu, Parayanam, P

హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత( Bhagavad Gita )ను ప్రతిరోజు ఒక అధ్యాయానాన్ని పారాయణం చేయాలి.అలాగే భాగవతం విషయానికి వస్తే వారం రోజుల్లోనే పారాయణం చేయాలన్న పద్ధతి కూడా ఉంది.ఇక లలితా సహస్రనామ పారాయణం ఇంటి ఇల్లాలి తో పాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి వారానికి ఒకసారి నిర్వహించాలి.ఇక భాగవతాలు లాంటివి అర్థం చేసుకుంటూ చదివితే తేలిగ్గా లీనం అవ్వవచ్చు.

ఇక భాష అర్థం కాకపోతే తెలుసుకోవాలని ఆలోచన ఉండాలి.ఇక ఒత్తిగా పుస్తకాల్లోనే అక్షరాలు చదివితే ప్రయోజనం ఉండదు.

అందుకే అందులోని అంతర్ధాన్ని పరమార్ధాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.

Telugu Bhagavad Gita, Bhakti, Devotional, Lord Krishna, Mahavishnu, Parayanam, P

భగవంతుండి నామ పారాయణం కథలు చదివేటప్పుడు లీనం కావాలి.అలా జరిగితేనే అర్థం, పరమార్థం కలుగుతుంది.ఇక భగవంతుడిపై పూర్తి దృష్టి పెట్టాలి.

చదువు రానివారు ఇతరుల పారాయణం చేసే సమయంలో శ్రద్ధగా వినాలి.అలా అయితే ప్రయోజనం చేకూరుతుంది.

విష్ణు సహస్రనామాలు, రామాయణం ( Ramayana)ధ్యాస పెట్టి చదవాలి.ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మధ్యలో అస్సలు లేవకూడదు.

అధ్యాయాన్ని సగం చదివి అసలు వడిలేయకూడడు.నిత్యం పారాయణం చేయడం వలన సమాజంలో ధార్మిక విలువలు కూడా పెరుగుతాయి.

ఇక దేవాలయాల్లో ప్రజాసంక్షేమం కోసం దేవున్ని ప్రార్థిస్తూ పారాయణాలు నిర్వహిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube