శనివారం లక్ష్మీ పంచమి ఆ దేవుని పూజిస్తే జీవితంలో ఓటమి అనేది ఉండదు..!

చైత్ర శుక్ల పంచమిని కల్పాది తిథి( Kalpadi Tithi ) అని అంటారు.ఈ రోజు ను లక్ష్మీ పంచమి( Lakshmi Panchami ) అని కూడా పిలుస్తారు.

 Saturday Lakshmi Panchami If You Worship That God, There Will Be No Defeat In Li-TeluguStop.com

ఉగాది అక్షయ తృతీయ తో సహా ఏడాదిలో ఏడూ కల్పాది రోజులు కూడా ఉంటాయి.లక్ష్మీ పంచమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.

ఆమె సంపద శ్రేయస్సును ప్రసాదించే దేవత.లక్ష్మీ పంచమిని శ్రీ పంచమి లేదా శ్రీ వ్రత అని కూడా అంటారు.

శ్రీ అనేది లక్ష్మీదేవికి మరో పేరు అని కొంతమందికి మాత్రమే తెలుసు.ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శ్రేయస్కరం.

ప్రజలు లక్ష్మీ పంచమి రోజు మొత్తం ఉపవాసం పాటిస్తారు.ఇంట్లో, కార్యాలయంలో లక్ష్మీదేవిని పూజిస్తారు.

చైత్రమాసంలో శుక్లపక్షంలోని ఐదవ రోజున శ్రీ లక్ష్మీ పంచమి జరుపుకుంటారు.ఈ రోజున లక్ష్మీదేవిని ( Goddess Lakshmi )పూజిస్తే దరిద్రం దూరమైపోతుంది.

భక్తులు తమ వ్యాపారం వృద్ధి కోసం లేదా సంపాదకు సంబంధించిన సమస్యల నుంచి దూరం అవ్వడానికి లక్ష్మీదేవి మంత్రాలను పాటించడం మంచిది.భక్తులు కనకధార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తంతో సహా లక్ష్మీ పంచమి రోజు వివిధ స్తోత్రలను పాటించాలి.

లక్ష్మీ పంచమి సంపద, విజయానికి సంబంధించినది.

Telugu Bhakti, Devotional, Goddess Lakshmi, Kalpadi Tithi, Poor Brahmins-Latest

భక్తులు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి.వారు ఉపవాసం ప్రారంభించే ముందు లక్ష్మీదేవి స్తోత్రాలు జపించాలి.పూజా సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని వేదికపై ఉంచాలి.

చందనం, అరటి ఆకులు, పూలదండ, బియ్యం, దుర్గం, ఎర్రటి దారం, తమలపాకులు, కొబ్బరి కాయలను లక్ష్మీదేవికి సమర్పించాలి.లక్ష్మీదేవికి హారతి ఇచ్చిన తర్వాత బ్రాహ్మణులకు ఆహారాన్ని సమర్పించాలి.

పేద బ్రాహ్మణులకు( poor Brahmins ) కొంత డబ్బులకు కొంత డబ్బు కూడా ఇవ్వడం మంచిదే.ఈ వ్రతం పాటించే భక్తులు చాలా సంపాదనను మరియు శుభ ఫలితాలను పొందుతారు.

అంతేకాకుండా ఈ వ్రతం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదు.భక్తులు పండ్లు, పాలు, తీపి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి.

తద్వారా లక్ష్మీదేవి తన భక్తులకు సంపద విజయాన్ని అనుగ్రహిస్తుంది.దీనివల్ల లక్ష్మీదేవిని పూజించే భక్తులకు అసలు జీవితంలో ఓటుమనేది ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube