హిందూ ధర్మంలో రుద్రాక్ష( Rudraksha )ను పరమేశ్వర రూపంగా పరిగణించి ధరిస్తారు.ఈ కారణంగా రుద్రాక్షకు మన సంస్కృతిలో గొప్ప స్థానం ఉంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
పౌరాణిక కథనాల ప్రకారం శివుని కన్నీటి నుంచి ఉద్భవించినదే రుద్రాక్ష అని పండితులు చెబుతున్నారు.రుద్రాక్ష ధరించడం వల్ల మానసిక ప్రశాంతత గ్రహదోషాల నుంచి విముక్తి కలిగి శుభ ఫలితాలు లభిస్తాయి.
కొందరు రుద్రాక్షలు మెడలో, మరికొందరు మణికట్టు వద్ద ధరిస్తారు.పవిత్రమైన రుద్రాక్షను మెడలో ధరించడం వల్ల ఒత్తిడి( Pressure ), ఆందోళన, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
అందుకే చాలామంది రుద్రాక్షను ధరిస్తారు.

అయితే భక్తుల నమ్మకాన్ని డబ్బు చేసుకునేందుకు కొంతమంది దుకాణదారులు నకిలీ రుద్రాక్షలను అసలైన రుద్రాక్ష అని అమ్ముతూ ఉన్నారు.మరి అసలైన రుద్రాక్ష, నకిలీ రుద్రాక్షను( Fake Rudraksha ) ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.శాస్త్రీయంగా రుద్రాక్షలు రెండు రకాలుగా విభజించారు.
స్వచ్ఛమైన లేదా నిజమైన రుద్రాక్షని ఇలియోకార్పస్ గానిట్రస్ గా వెల్లడించారు.నకిలీ లేదా భద్రాక్షని ఇలియోకార్పస్ లాకునోసస్ అని పిలుస్తారు.
ఇవి కాకుండా ప్లాస్టిక్ రుద్రాక్షలను కూడా మార్కెట్ లో చూడవచ్చు.ఈ కారణంగా రుద్రాక్షను కొనుగోలు చేయడానికి ముందు అది అసలైనదా లేదా నకిలీదా అని సరిగ్గా తనిఖీ చేస్తూ ఉండాలి.

నకలీ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.ముఖ్యంగా చెప్పాలంటే మీరు నకిలీ రుద్రాక్షను అవ నూనెలో కాసేపు ముంచడం ద్వారా అది అసలైనదో కాదో తెలుసుకునే వీలు ఉంటుంది.నిజమైన రుద్రాక్ష రంగు మారదు.అదే నకిలి రుద్రాక్షను అవ నూనెలో వేసి కొంతసేపు ఉంచితే దాని రంగు మారిపోతుంది.అలాగే ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో రుద్రాక్షను ఉంచితే నీటిలో మునిగితే అది అసలైన రుద్రాక్ష.మరి నీటిపై తేలితే అది నకిలిది అని చెబుతున్నారు.
అంతే కాకుండా రెండు రాగి రేకుల మధ్య రుద్రాక్షను ఉంచితే వేగంగా తిరుగితే అది అసలైన రుద్రాక్ష.అయితే ఎలాంటి చలనం లేకుండా ఉంటే అది నకిలీ రుద్రాక్ష అని అర్థం చేసుకోవచ్చు.