హిందూ సనాతన ధర్మం ప్రకారం దాన ధర్మాలు చేయడం గొప్ప పుణ్యమని ప్రజలు భావిస్తారు.ఏదైనా ఉపవాసం లేదా పెద్ద పండుగ సమయంలో మనం దానధర్మాలు చేస్తాము.
మత గ్రంథంలో దాతృత్వం అత్యంత పవిత్రమైన పనిగా భావిస్తారు.మన ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వానికి కచ్చితంగా ఇవ్వాలి.
మనం ఏ ధర్మం చేసిన ఫలితం మనకే కాదు మన తర్వాతి తరానికి కూడా దక్కుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే హిందూ మతం( Hindu religion )లో సాధారణ దాతృత్వం కంటే రహస్య దాతృత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

మనం ఎవరికి చెప్పకుండా ఏదైనా దానం చేస్తే దానిని రహస్యదానం అని అంటారు.దీనివల్ల ఆ వ్యక్తి రెట్టింపు ఫలితాన్ని పొందుతాడు.కొన్ని వస్తువులను రహస్యంగా దానం చేయడం ద్వారా ఆ వ్యక్తి దురదృష్టం అదృష్టంగా మారుతుంది.అలాంటి వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది పూజ తర్వాత పండ్లను దానం చేస్తారు.హిందూ మతంలో పండ్లు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.పండ్లను దానం చేయడం వేసవిలో రహస్యంగా చేయాలి.కానీ కట్ చేసిన పండ్లను దానం చేయకూడదు.

ఎప్పుడూ మొత్తం పండ్లను దానం చేయడమే మంచిది( Fruits ).సంతానాన్ని పొందాలనుకునేవారు వేసవిలో రహస్యంగా పండ్లను దానం చేయాలి.అలాగే ప్రజలు జల ధానాన్ని కూడా గొప్పదానంగా భావిస్తారు.మీరు వేసవిలో ఎవరి దాహాన్ని తీర్చిన దేవుడు చాలా సంతోషిస్తాడు.వేసవికాలంలో మట్టి కుండా లేదా శీతల పానీయం దానం చేయాలి.ఇది చాలా పుణ్యాన్ని ఇస్తుంది.
మరోవైపు మీరు ఏ విధంగానైనా నీటి ఏర్పాట్లు చేయగలిగితే కచ్చితంగా చేయాలి.తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీపై ఎప్పుడు ఉంటాయి.
అలాగే రహస్యంగా బెల్లం దానం( Jaggery )చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది.ఇంకా చెప్పాలంటే వేసవిలో ప్రజలు పెరుగును ఎక్కువగా తీసుకుంటారు.
అటువంటి పరిస్థితిలో ఈ వేసవికాలంలో పెరుగును రహస్యంగా దానం చేయడం వల్ల జాతకంలో శుక్రుని స్థానం బలపడుతుంది.