మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ నుంచి బతుకమ్మ సంబరాలు( Bathukamma celebrations ) మొదలయ్యాయి.ఇంకేముంది ఊరు, వాడ బతుకమ్మ పాటలతో, ఆటలతో కోలాహలంగా మారిపోయింది.
బతుకమ్మను అందంగా పేర్చి ఇంటిముందు పెట్టి బతుకమ్మ పాటలు చెప్పుకుంటూ ఆడుతూ, పాడుతూ ఉంటారు.తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగా ఏ రోజుకు ఆ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు.అలాగే రకరకాల నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.
బతుకమ్మ పండుగ మొదటి రోజు అంటే ఎంగిలిపూల బతుకమ్మను( Angilipula Batukammanu ) పెత్ర మాస రోజున జరుపుకుంటారు.

ఇంకా చెప్పాలంటే ఈ రోజు నుంచి తొమ్మిది రోజులపాటు ఈ పండుగ కొనసాగుతుంది.మరి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి బతుకమ్మ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు రావడానికి ఎన్నో కారణాలను చెబుతూ ఉంటారు.
అందులో ముఖ్యమైన కారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బతుకమ్మను అందంగా పేర్చడానికి మహిళలు ఎన్నో రకాల పువ్వులను తెస్తారు.
పెద్ద తాంబాలం తీసుకుని అందులో సరి పోయే విధంగా పూలకాడలను కత్తిరించి ఒకరి దగ్గర పెడతారు.అయితే పువ్వుల కాడలు సమానంగా ఉండేందుకు కత్తెరను కానీ, చేతులను కాని ఉపయోగించకుండా నోటితో వీటిని తెంపుతారు.

ఈ పువ్వులతో బతుకమ్మను పేర్చడం వల్ల మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు.అంతేకాకుండా ఎంగిలిపూల బతుకమ్మను ఒక రోజు ముందుగానే కోసిన పూలతో పేరుస్తారు.అంటే ఒక రోజు నిద్ర తర్వాత ఈ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.ఈ పూలు వాడడం వల్ల కూడా బతుకమ్మకు ఆ పేరు వచ్చిందని కొంతమంది చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ పేత్ర మాస రోజునే మొదలవుతుంది.ఇక ఈ పేత్ర మాస రోజున పెద్దల ఆత్మకు శాంతి చేకూరాలని తర్పణాలు సమర్పిస్తారు.
అంటే ఈ రోజు ఉదయాన్నే భోజనం చేసిన తర్వాత సాయంత్రం బతుకమ్మను పేరుస్తారు.ఈ కారణం వల్ల కూడా ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు.