కొత్త టీమ్ ను సిద్ధం చేస్తున్న బాబు 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో( AP elections ) టిడిపి కూటమి ఘనవిజయం సాధించడం ,వైసిపి ఘోర పరాజయం చెందడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.

 Babu Is Preparing A New Team , Tdp, Janasena, Ysrcp, Telugudesam, Chandrababu, A-TeluguStop.com

ఇక కొత్త మంత్రి వర్గం లోకి ఎవరెవరిని తీసుకోవాలి,  పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు కేటాయించాలి ?  ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనే అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.దీంతో పాటు పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

Telugu Apcs, Ap, Babu, Chandrababu, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politics

జగన్ ( jagan )ప్రభుత్వ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెడుతున్నారు.సిఎస్ , డిజిపి తో పాటు , సీఎం కార్యాలయ అధికారులను చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు.పూర్తిగా తన టీమ్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  దీనిలో భాగంగానే అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని ముందుగానే మొదలుపెట్టారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు .ఆయన ఈ నెల ఆఖరున పదవి విరమణ చేయనున్నారు.చంద్రబాబు సూచనలతో జవహర్ రెడ్డి( Jawahar Reddy ) సెలవు వెళ్లారు.

Telugu Apcs, Ap, Babu, Chandrababu, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politics

అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా జగన్ హయాంలో పనిచేసిన రావత్ అనారోగ్య కారణాలతో ఉన్నారు.చంద్రబాబు తన పాలన ప్రారంభానికి ముందే సీఎస్,  డీజీపీ , ఇంటిలిజెన్స్ చీఫ్ నియామకం పైన ఫోకస్ చేశారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే అధికారుల టీమ్ ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .2014 – 19  టీడీపీ ప్రభుత్వ హయాంలో తన కార్యాలయంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ , గిరిజ శంకర్ ( Sai Prasad, Girija Shankar )లకు మళ్ళీ అవకాశం ఇచ్చే ఆలోచనతో ఉన్నారు.ఈ ఇద్దరితో పాటు సిద్ధార్థ జైన్ ను సీఎంఓలోకి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.

ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నిన్ననే చంద్రబాబుతో భేటీ  అయ్యారు ఆ సమయంలో చంద్రబాబు ఆయనను పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు.చంద్రబాబుకు కొన్ని విషయాలను వివరించే ప్రయత్నం చేసినా,  ఇప్పుడు ఏమి అవసరం లేదని తేల్చి చెప్పారు.

జవహర్ రెడ్డి స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పైనే  ప్రస్తుతం చంద్రబాబు దృష్టి సారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube