వీడియో: యూకేలో రోడ్డు రేజ్ ఇన్సిడెంట్.. డ్రైవర్‌పై రాయితో అటాక్..?

ఇటీవల కాలంలో రోడ్డు రేజ్ సంఘటనలు పెరిగిపోతున్నాయి.తోటి వాహనదారులకు అసభ్యకరమైన సైగలు చేయడం, వెహికల్స్ ( Vehicles )ముందుకెళ్లకుండా వారి ముందే వాహనాలు నడపడం, పెద్దగా హారన్ కొడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించడం, బూతులు తిట్టడం వంటివన్నీ కూడా రోడ్డు రేజ్ కిందకి వస్తాయి.

 Video Road Rage Incident In Uk, Stone Attack On Driver , Coventry, England, Road-TeluguStop.com

ఈ ఘటనలు ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల ఇంగ్లాండ్ దేశం, కోవెంట్రీ సిటీ, హిల్ఫీల్డ్స్ ( Country of England, Coventry City, Hillfields )ప్రాంతం, లోయర్ ఫోర్డ్ స్ట్రీట్ లో ఒక ఘోరమైన రోడ్డు రేజ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.

ఒక ఘర్షణ తర్వాత, పరిస్థితి హింసాత్మకంగా మారింది.

వివరాల్లోకి వెళితే ఇటీవల ఒక మెర్సిడెస్-బెంజ్ డ్రైవర్ ( Mercedes-Benz driver )ఒక జంక్షన్ నుంచి తిరుగుతున్నప్పుడు వెనుక నుంచి వేరే వాహనం ఢీ కొట్టింది.

ఆ షాక్ తో, మెర్సిడెస్ డ్రైవర్ తన కారుకు జరిగిన నష్టాన్ని చిత్రీకరించడం ప్రారంభించాడు.ఈ ఘటనను చూసి, మరొక కారు డ్రైవర్ తన వాహనం నుంచి బయటకు వచ్చి మెర్సిడెస్ డ్రైవర్‌ను ఢీకొన్న వ్యక్తితో వాగ్వాదం ప్రారంభించాడు.

ఈ వాగ్వాదం వెంటనే హింసాత్మకంగా మారింది.అందుబాటులో ఉన్న వీడియో, చిత్రాలలో, ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది.ఈ ఘర్షణలో, మెర్సిడెస్ డ్రైవర్ రాయితో మరొక వ్యక్తిని తలపై కొట్టినట్లు వీడియోలో కనిపించింది.ఈ ఘటనలో మెర్సిడెస్ కారుకు బాగా నష్టం జరిగింది.ఒక ప్రత్యక్షదర్శి ప్రకారం, మెర్సిడెస్ డ్రైవర్‌ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా జంక్షన్ నుంచి బయటకు వచ్చాడు.దీంతో మరొక డ్రైవర్ తన హార్న్ మోగించాడు.

దీంతో మెర్సిడెస్ డ్రైవర్ అత్యవసర బ్రేక్ వేయాల్సి వచ్చింది.వాగ్వాదం ముదురుతున్నప్పుడు, మరొక వ్యక్తి మొదట మెర్సిడెస్ డ్రైవర్‌ను ఢీకొనడానికి ప్రయత్నించాడు.

అది సాధ్యం కాకపోవడంతో, అతను నేరుగా మెర్సిడీస్ వైపు కారును నడిపించాడు.ఈ దృశ్యం చాలా షాకింగ్ గా ఉంది.

ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube