ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.అందులో ముఖ్యమైనది డయాబెటిస్ అని కచ్చితంగా చెప్పవచ్చు.
డయాబెటిస్( Diabetes ) తో బాధపడుతున్న వారు తీసుకునే ఆహార పదార్థాలలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉండాలి.అలాగే వీరు వారంలో రెండు సార్లు అయినా డయాబెటిస్ టెస్ట్ చేసుకోవడమే మంచిది.
ఎందుకంటే ఈ వ్యాధి ఒకసారి వస్తే అంత సులభంగా మాత్రం తగ్గదు.అయితే క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు వ్యాయామం చేస్తూ ఉంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది.
అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉంటే శరీరంలో చక్కర స్థాయిలో కూడా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.మధుమేహా వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మామిడికాయ( Mango )లో 46 గ్రాముల చక్కెర ఉంటుంది.కాబట్టి దాన్ని తినకూడదు.అలాగే కప్పు ద్రాక్ష పండ్లలో 23 గ్రాముల షుగర్ ఉంటుంది.కాబట్టి దీన్ని దూరంగా పెట్టాలి.
అలాగే ఒక కప్పు చెర్రీ బండలో 18 గ్రాముల చక్కెర ఉంటుంది.కాబట్టి దీన్ని తినకపోవడమే మంచిది.
అలాగే మద్యస్థంలో ఉండే బెర్రీ పండులో 17 గ్రాముల చక్కెర నిల్వలు ఉంటాయి.కాబట్టి వీటిని అస్సలు తినకూడదు.ఇంకా చెప్పాలంటే పుచ్చకాయ ఒకటి లేదా రెండు ముక్కలు తినవచ్చు.అంతకుమించి తింటే 17 గ్రాముల చక్కెర శరీరంలోకి చేరిపోతుంది.అలాగే రెండు అంజిరా పండ్లు( Anjeer Fruit ) తింటే శరీరానికి 16 గ్రాముల చక్కెర లభిస్తుంది.కాబట్టి దీన్ని కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి.
అలాగే మద్యస్థంగా ఉండే ఒక అరటి పండులో 14 గ్రాముల షుగర్ ఉంటుంది.దీన్ని తినాలనిపిస్తే సగం వరకు తినవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.