ఎవరన్నా అందంగా ఉన్నారు అంటే దానికి కారణం ముఖ్యంగా జుట్టు.జుట్టు లేకపోతే ఎటువంటి వాళ్లైనా సరే అందంగా కనపడరు.
అటువంటి జుట్టు విషయంలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి.ఇప్పుడు మనం వాడే షాంపూ.
రకరకాల కండిషనర్లు.అన్నీ కూడా రసాయనాలతో చేయబడినవే.
అసలు మనకి జుట్టు ఊడిపోయే సమస్య అక్కడినుంచీ మొదలు అవుతోంది.ఎంతో ధృడంగా ఉండే జుట్టుని మన చేతులారా అనేకరకాల షాంపూలు వాడి పోగొట్టుకున్తున్నాం.
పూర్వం ఇటువంటి షాంపూలు లేనప్పుడు మనం కుంకుడు కాయలు వాడే వాళ్ళం వాటివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కుంకుడుకాయలు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు దాగున్నాయి.
ఇది ప్రక్రుతి సహజసిద్ధంగా దొరికే షాంపూ.రెండు స్పూన్స్ చప్పున కుంకుడుకాయ మరియు ఉసిరికాయ పొడి.
మరో రెండు స్పూన్స్ తేనే కలిపి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి పట్టేలా చేసి ఒక అరగంట ఉంచాలి.
ఇలా చేసిన తరువాత తలస్నానం చేయాలి.ముందుగా నూనెను జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి.
అనంతరం గంట అనంతరం సహజంగా దొరికే కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడే సమస్య తీరుతుంది.తరువాత సాంబ్రాణి పొగతో ఆరేలా చేయాలి అంతేకానీ తుండుతో బలంగా తుడవకూడదు.
అలాగే సున్నితంగా ఉండే తుండుతోనే తలని మెల్లగా తుడవాలి.అంతేకాదు కుంకుడుకాయ గింజని బాగా అరగదీసి తేలు కుట్టిన చోట అద్దితే నొప్పి తగ్గుతుంది.
కుంకుడుకాయ రసంలో కొద్దిగా వెనిగర్ కలిపి అందులో కొంచెం నీరు ఈ మిశ్రమంతో కిటికీలు.తలుపులు.
గాజు వస్తువులను శుభ్రపరచుకోవచ్చు.