తులసి ఆకులను ఇలా వాడితే.. ఎన్నో రకాల ఔషధ గుణాలు మీ సొంతం..?

మన దేశంలో చాలా మంది ప్రజలు తులసి( Holy Basil )ని ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు.

తులసి మొక్కను ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రధానమైన ఔషధ మూలికగా ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే తులసి శాస్త్రీయ నామం ఆసిమమ్ టెనుప్లోరమ్( Ocimum tenuiflorum ).ఇది లామియాసి కుటుంబానికి చెందిన మొక్క.తులసి భారత ఉపఖండానికి చెందినది.

మన దేశంలో తులసి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన మొక్క అని పండితులు చెబుతున్నారు.

ఆయుర్వేదంలో తులసి చాలా ఔషధ గుణాలు( Medicinal Properties ) కలిగి ఉంటుంది.తులసి అడాప్టోజెనిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటి ఇన్ఫ్లమేటరీ,ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలన్ని కలిగి ఉంటుంది.తులసిని వివిధ రకాల ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

Advertisement

తులసి మొక్క ఆకులను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.తాజా తులసి ఆకులు లేదా ఎండిన ఆకుల పొడిని వేడి నీటిలో వేసి టీ( Tulsi Tea ) తయారు చేసుకోవచ్చు.

ఇది చాలా రిఫ్రెష్షింగ్ ఉండే టీ.

ఒక కప్పు వేడినీటినీకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల తులసి ఆకులు పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత టీ తాగాలి.తులసి టీ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

కొన్ని తాజా తులసి ఆకులు లేదా తులసి పొడి ఒక కుజా నీటిలో వేసి రాత్రంతా మూత పెట్టి అలాగే ఉంచాలి.తెల్లవారి తరువాత రోజంతా ఆ నీటిని తాగడం వల్ల మన శరీరం డిటాక్స్ అవుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ప్రతి రోజు రెండు లేదా మూడు తులసి ఆకులు పరిగడుపున తినడం వల్ల రోగ నిరోధక శక్తి( Immunity Boosting ) పెరుగుతుంది.అలాగే వంటకాల రుచి పెరగడం కోసం కూడా తులసి ఆకులను ఉపయోగించవచ్చు.

Advertisement

మార్కెట్లో లభించే తులసి క్యాప్సిల్స్ ను వైద్యుల సలహా తీసుకొని మాత్రమే ఉపయోగించడం మంచిది.ఎందుకంటే ఆ క్యాప్సిల్స్ ను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వేరే ఔషధమూలికను కూడా కలిపి ఉండవచ్చు.

తాజా వార్తలు