ప్రైవేట్ విద్యాసంస్థలతో కుమ్మకైన ఎంఈఓ: రామావత్ రమేష్ నాయక్

నల్లగొండ జిల్లా: దేవరకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాధుడే లేడని,రెగ్యులర్ గా టీచర్స్ స్కూల్ కి వస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన ఎంఈఓ ప్రైవేట్ విద్యా సంస్థలతో కూమ్మకై ప్రభుత్వ పాఠశాలను గాలికొదిలేశారని బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ ఆరోపించారు.శుక్రవారం దేవరకొండలోని బీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంఈఓఆపీస్ లో ఒక్కో సంతాకానికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసుకొని,ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజారుస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Nalgonda District Bahujan Samajwadi Party Allegations On Meo, Nalgonda District-TeluguStop.com

ప్రైవేట్ విద్యా సంస్థలు క్వాలిఫికేషన్ లేని టీచర్లను పెట్టుకొని అడ్డగోలు ఫీజులు పెంచుతూ పేద తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నా నియంత్రించవలసినఎంఈఓ వారిచ్చే మామూళ్లకు అలవాటు పడి పట్టించుకోవడం లేదని వాపోయారు.ఒక విద్యాసంస్థను కూడా విజిట్ చేయకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లల తల్లిదండ్రులను మా స్కూల్లోనే పుస్తకాలు కొనాలి,మా స్కూల్లోనే బట్టలు కొనాలని వారిపై ఒత్తిడి చేసి ఒకటో తరగతి ఒక్కొక్క పిల్లాడి తల్లిదండ్రుల దగ్గర సుమారు బట్టలకు రూ.5000,పుస్తకాలకు రూ.5000 అని,ఇవి కాకుండా బయట నుంచి మరొక వెయ్యి రూపాయల నోటు పుస్తకాలు తీసుకురావాలని వారి జేబులను కొల్లగొడుతున్నా ప్రైవేట్ విద్యాసంస్థల మీద ఇంతవరకు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ ఏ ఒక్క రోజు వాటిని విజిట్ చేయడం గానీ,

దాంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూడడం గానీ,క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లను పెట్టారా లేదా పర్యవేక్షించకుండా ఉంటున్నారన్నారు.ఎంఈఓ పైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను మరియు జిల్లా కలెక్టర్,డిఇఓను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ కొండ లలిత, పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్, స్వేరో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు ఇంజమూరి శేఖర్, బిట్ సెల్ కన్వీనర్ శ్రీరామదాసు, తరుణ్ చారి,జంతుక అనిల్,మాతంగి జాన్, అంకురి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube