సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.పొట్టి శ్రీ రాములు సెంటర్ నుంచి ఇందిరా చౌక్ వరకు 200 మీటర్ల పొడవునా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లలో కొన్ని లైట్లు పనిచేయడం లేదని,చెడిపోయిన లైట్లకు మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారని, జాతీయ రహదారిపై సైతం కొన్ని లైట్లు వెలగకపోవడంలో చీకట్లు అలుముకుంటున్నాయని పట్టణ ప్రజలు,వాహనదారులు వాపోతున్నారు.
స్వయంగా మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.