జిల్లెడుగుంట ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయి అంటే.. బెంగళూరులో శ్రీవారి కల్యాణోత్సవం ఎప్పుడంటే..

శ్రీ సత్య సాయి జిల్లాలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.వేడుకల్లో కీలకమైన భక్తులను తొక్కే ఘటనను చూసేందుకు వేలాది మంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి తరలి వచ్చారు.

 How Was Anjaneya Swamy Brahmotsavam Held In Jilledugunta When Is Srivari Kalyano-TeluguStop.com

భూతప్పల కాళీ స్పర్శతో కోరికలు నెరవేరుతాయి అని భక్తులు నమ్ముతారు.ఈ ఉత్సవాల్లో భూతప్పలు భక్తులను కాలితో తొక్కే ఘటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాల నుంచి భూతప్పల వేషధారణ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు భక్తులపై నడుచుకుంటూ వెళ్లారు.కాలి స్పర్శతో కోరికలు నెరవేరుతాయని భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు.

ఈ బ్రహ్మోత్సవాన్ని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను ఘనంగా పూర్తి చేశారు.

అంతేకాకుండా బెంగళూరులో ఈ నెల 16న శ్రీవారి కల్యాణం జరిగే అవకాశం ఉంది.

డిసెంబర్ 16వ తేదీన శ్రీనివాస కళ్యాణం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో అధికారులలో కలిసి ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో సదా భార్గవి పరిశీలించి కొన్ని సూచనలు కూడా చేశారు.

బెంగళూరు రాంనగర్ స్టేడియంలో వేదిక నిర్మాణం, విద్యుత్ అలంకరణలు, భద్రత ఏర్పాట్లు గురించి అధికారులతో చర్చించారు.

Telugu Anjaneyaswamy, Bakti, Bengaluru, Devotional, Jilledugunta-Telugu Bhakthi

శ్రీవారి కళ్యాణం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.విజిలెన్స్ స్థానిక పోలీస్ అధికారులతో చర్చించి అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.

భారీకేడ్లు, వీఐపీల ప్రవేశ మిశ్రమాన మార్గాలు, భక్తులు కూర్చునేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.జేఈవో సమక్షంలో జగదీశ్వర్ రెడ్డి విజిఓ మనోహర్ డిఈ రవిశంకర్ రెడ్డి శ్వేతా డైరెక్టర్ ప్రశాంతి శ్రీనివాస కళ్యాణం మాజీ సీఎం కుమారస్వామి, ప్రతినిధి అశ్విన్ బెంగళూరు పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube