మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశి ధన త్రయోదశిగా జరుపుకుంటాము.దీపావళి పండుగను ఐదురోజుల పాటు జరుపుకుంటున్న సందర్భంగా ధన త్రయోదశి రోజున ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఈ ఏడాది ఈ పండగ నవంబర్ 2వ తేదీ వచ్చింది.ఈ క్రమంలోనే ధన త్రయోదశి రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి ఉద్భవించి ఉందని లక్ష్మీదేవితో పాటు ధన్వంతరీ సముద్ర గర్భం నుంచి ఉద్భవించి ఆ రోజున అమ్మవారి పుట్టినరోజుగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ క్రమంలోనే లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అలాగే ఎంతో శుభప్రదమైన రోజున బంగారు, వెండి నగలను కొనుగోలు చేస్తారు.ఇలా బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తారు.
ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదని చెబుతారు.ముఖ్యంగా ఇనుము గాజువంటి వస్తువులను కొనుగోలు చేయడంతో ఆర్థిక సమస్యలు కలుగుతాయని భావిస్తారు.

అలాగే ఎంతో శుభప్రదమైనది ధన త్రయోదశి రోజున కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున పొరపాటున కూడా తెల్లని దుస్తులను దానం చేయకూడదు.అయితే సూర్యాస్తమయం అయ్యేలోగా దానధర్మాలను చేయడం ఎంతో మంచిది.ధన త్రయోదశి రోజు ముఖ్యంగా దుస్తులను, ధాన్యాలను, దానం చేయాలి.అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఎంతో శుభం జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.