Healthy Drink Winter: వింటర్ లో రోజు నైట్ ఈ డ్రింక్ తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

వింటర్ సీజన్ రానే వచ్చింది.ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ముప్ప తిప్పలు పెడతాయి.

 Taking This Drink At Night In Winter Is Very Good For Health! Health, Health Tip-TeluguStop.com

ఇక జలుబు దగ్గు వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పనిగ‌ట్టుకుని మరీ వచ్చి ప్రాణాలు తీస్తుంటాయి.

అయితే వింటర్ లో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను ప్రతిరోజు నైట్ కనుక తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఓ చూపు చూసేయండి.

ముందుగా అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ ను పోసుకోవాలి.

మిల్క్ కాస్త హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, ఆఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్కపొడి వేసి ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి.

అనంతరం స్టైనర్‌ సహాయంతో పాలను ఫిల్టర్ చేసుకోవాలి.పాలు కాస్త గోరువెచ్చగా అయినా త‌రువాత వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.

నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.తద్వారా ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.

అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.సీజ‌న‌ల్‌ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Telugu Ashwagandha, Cinnamon, Ginger, Tips, Healthy, Latest, Care-Telugu Health

ఎముకలు బ‌లంగా మారతాయి.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే దూరం అవుతాయి.గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.

కాబట్టి ప్రస్తుత చలికాలంలో తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube