భారీ బడ్జెట్ సినిమాలకు మాస్ సాంగ్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేవర సినిమా( devara movie ) బాగానే ఉన్నా సినిమాలో మాస్ సాంగ్ అయిన దావూదీ సాంగ్ ( Dawoodi Song )లేదనే అసంతృప్తి అభిమానులలో చాలామందిని వెంటాడింది.
ఈ సాంగ్ ను యాడ్ చేయరేమో అని ఫ్యాన్స్ భావించారు.మరి కొందరు అయితే దేవర సీక్వెల్ లో ఈ సాంగ్ ఉంటుందని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సైతం వైరల్ అయ్యాయి.
దావూవీ సాంగ్ కు ముందు ఒక సీన్ ను యాడ్ చేయడం దేవరకు అదనపు అడ్వాంటేజ్ అయింది.తారక్ వీరాభిమానులు ( Tarak )ఈ సాంగ్ కోసం సినిమాను మళ్లీ థియేటర్ లో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈరోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి.దసరా సెలవులను సైతం దేవర బాగానే క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది.దసరాకు ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా దేవర స్థాయిలో ప్రేక్షకులను మెప్పించే మూవీ కష్టమనే సంగతి తెలిసిందే.

వేట్టయన్ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఆసక్తి చూపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.దేవర మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం తెలివిగా అడుగులు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.దేవర తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ లో ఏకంగా 123.59 కోట్ల రూపాయల( 123.59 crore rupees ) షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం జరిగింది.

అభిమానుల కామెంట్లను అర్థం చేసుకుంటూ తారక్ కథలను ఎంపిక చేసుకుంటున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఎన్నో అవార్డులను అందుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఈతరంలో ఎంతోమంది నటులకు ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.