కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా లింగుస్వామి( Linguswamy ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఆవారా మూవీ( Awara movie ) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పించింది.
ఈ సినిమాలోని నీ ఎదలో నాకే చోటే వద్దు సాంగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.తమిళంలో ఈ సినిమా పయ్యా అనే టైటిల్ తో విడుదలై అక్కడ కూడా హిట్ గా నిలిచింది.

అయితే మొదట ఈ సినిమా ఆఫర్ నయనతార దగ్గరకు వెళ్లిందట.నయనతార సైతం ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెప్పారట.అయితే దర్శకుడికి, నయనతారకు ( Nayantara )మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ లోకి తమన్నా ఎంట్రీ ఇచ్చారు.నయనతార ఆ పాత్రకు సూట్ అయ్యేవారు కాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆవారా సినిమాకు తమన్నా పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఆవారా సినిమా రిలీజ్ తర్వాత తమన్నా కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఆమె కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఈ సినిమా ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.యాక్షన్ అడ్వెంచర్ కాన్సెప్ట్( Action adventure concept ) తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
కార్తీకి ఈ సినిమా ఒకింత మంచి పేరును తెచ్చిపెట్టింది.ఆవారా సినిమాలో నటించిన సమయంలో తమన్నా ఏజ్ 19 సంవత్సరాలు అని తమన్నా టాలెంట్ ఉన్న నటి అని ఆయన చెప్పుకొచ్చారు.
తమన్నా కారులోనే క్యాస్టూమ్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి అని మా ఇబ్బందిని తమన్నా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.తమన్నా తప్పకుండా స్టార్ అవుతుందని అప్పుడే ఊహించానని లింగుస్వామి తెలిపారు.







