1.కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాట్లు చేసింది.ఈనెల 22 అనగా రేపు ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు పరీక్ష జరగనుంది.
2.చాగంటి కోటేశ్వరావుకు టీటీడీ కీలక పదవి

ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు ను తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది.
3.వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
హైదరాబాదులోని కేస్లాపూర్ లో నాగోబా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభమైంది.
4.తెలంగాణలో ప్రధాని పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోది తెలంగాణ పర్యటన ఖరారు అయింది.ఫిబ్రవరి 13 న హైదరాబాద్ కు రానున్న ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
5.మూడో రోజు ఐటి సోదాలు
హైదరాబాద్ శ్రీ ఆదిత్య హోమ్స్ లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
6.వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడి

దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి.తాజాగా వందే భారత్ ట్రైన్ పై కంచరపాలెంలో కొంతమంది ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు.ఈ దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి.ఈ ఘటనపై ఆర్పిఎఫ్ పోలీసులు విచారణ చేపట్టారు.
7.సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై కోదండరాం కామెంట్స్
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై జన సమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
8.చంద్రబాబు లోకేష్ కు ప్రాణహాని : బుద్ధ వెంకన్న

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని టిడిపి ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు.
9.రేవంత్ రెడ్డి కామెంట్స్
రాహుల్ గాంధీ టీషర్ట్ బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని పిసిసి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
10.తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ

హైదరాబాద్ నగరంలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.హత్ సే హత్ కార్యక్రమం పై చర్చించనున్నారు.
11.రాహుల్ పై ఉత్తంకుమార్ కామెంట్స్
ఆదిశంకరాచార్యుల తర్వాత రాహుల్ గాంధీ మాత్రమే దేశ యాత్ర చేశారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
12.కెసిఆర్ ప్రభుత్వం పై విజయశాంతి కామెంట్స్

దళిత బంధు కోసం బడ్జెట్లో 17,700 కోట్లు కేటాయించి, గత పది నెలల్లో రూపాయి కూడా తీయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు.
13.టీచర్ల మౌన దీక్ష
సంవత్సరం కాలంగా 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీల కోసం ఎదురుచూస్తున్న స్పోజ్ ఉపాధ్యాయులు ఈరోజు డీఎస్సీ కార్యాలయం ముందు మౌన దీక్షకు దిగారు.దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
14.గోల్కొండ సందర్శన బంద్

ఈనెల 28, 29 తేదీల్లో గోల్కొండ సందర్శనను నిలిపివేయనున్నారు.నగరానికి వచ్చే జీ20 ప్రతినిధుల సందర్శన నేపథ్యంలో ప్రజలు సాధారణ సందర్శకులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు.
15.జీవీఎల్ కామెంట్స్
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో అద్భుత అభివృద్ధి సాధిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశంసించారు.
16.తిరుమలలో డ్రోన్ కలకలం

తిరుమలలో డ్రోన్ కెమెరా వ్యవహారం కలకలం రేగుతుంది శ్రీవారి ఆలయం గగనతలపై డ్రోన్ కెమెరాలకు, విమానాలకు కూడా అనుమతి లేదు.కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది ఈ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలు డ్రోన్ కెమెరాతో షూట్ చేసినట్టుగా స్పష్టంగా కనిపించడం తో టిటిడి అధికారులు అప్రమత్తమయ్యారు.దీనిపై విచారణ జరుగుతున్నారు.
17.అయ్యన్నపాత్రుడు పై నర్సీపట్నం ఎమ్మెల్యే విమర్శలు
అయ్యన్నపాత్రుడు ఒక సైకో అంటూ నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ విమర్శలు చేశారు.
18.ఏపీ పారిశ్రామికవేత్తకు వై కేటగిరి భద్రత

ఆంధ్రప్రదేశ్ లోని పుంగనూరు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ కు వై కేటగిరి భద్రత కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
19.రెండో రోజు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ పర్యటన
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు థాక్రే రెండో రోజు తెలంగాణలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ , సేవా ధల్, ఐ ఎన్ టి యు సి నేతలతో ఆయన భేటీ అవుతున్నారు.
20.దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఈనెల 31 వరకు ఉత్సవాలు జరుగుతాయి.దీనికోసం టిటిడి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.