తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై సస్పెన్స్ వీడింది.రేవంత్ పాదయాత్రకు రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇవాళ నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈనెల 26న ప్రారంభంకానుందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలలపాటు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది.కాగా ఈ యాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించనుండగా.
సుమారు 50 నియోజకవర్గాల్లో కొనసాగనుందని సమాచారం.అదేవిధంగా పాదయాత్రలో ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీ ఒక రోజు పాల్గొనేలా తీర్మానం చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇకపై ఠాక్రే హాజరైన సమావేశానికి మూడు సార్లు రాకపోతే ఎందుకు రాలేదో వివరణ తీసుకుంటామని పేర్కొన్నారు.