సాధారణంగా కొందరికి పొడవాటి జుట్టు( Long hair ) అంటే చాలా ఇష్టం ఉంటుంది.కానీ ఎంత ప్రయత్నించినా జుట్టు మాత్రం పొడుగ్గా పెరగదు.
జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు ఖరీదైన ఆయిల్, షాంపూ, సీరం ఇలా ఎన్నెన్నో ఉత్పత్తులను వాడుతుంటారు.తోచిన చిట్కాలు అన్నీ ప్రయత్నిస్తుంటారు.
అయినప్పటికీ జుట్టు పొడుగ్గా పెరగకపోతే ఎంతగానో మదనపడతారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే.
ఈ రెమెడీని పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఓ లుక్కేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం ( Rice )వేసి వాటర్ పోసి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన అల్లం ముక్కలు మరియు నానబెట్టుకున్న బియ్యం వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి, ( Curry powder )రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి( Amla Powder ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు కనుక ఈ రెమెడీని పాటిస్తూ ఉంటే హెయిర్ గ్రోత్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు పొడుగ్గానే కాకుండా ఒత్తుగా కూడా పెరుగుతుంది.కాబట్టి పొడవాటి జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.పైగా ఈ రెమెడీ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.జుట్టు చిట్లడం విరగడం వంటివి సైతం కంట్రోల్ అవుతాయి.







