త‌ర‌చూ గుండెల్లో మంట‌గా ఉంటుందా? అయితే ఈ ఫుడ్స్‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

గుండెల్లో మంట లేదా హార్ట్ బ‌ర్న్‌.మొద‌లైందంటే మ‌న‌సు ప్ర‌శాంత‌గా ఉండ‌దు.తీవ్రమైన నొప్పి మ‌రియు అసౌక‌ర్యానికి గుర‌వుతారు.ఏ ప‌నీ చేయ‌లేక‌పోతుంటారు.చికాకు పెరిగి పోతుంటుంది.ఈ క్ర‌మంలోనే గుండె మంట‌ను చ‌ల్లార్చుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తారు.

 These Foods Do Not Take Who Suffered With Heartburn! Heartburn, Bad Foods, Lates-TeluguStop.com

అయితే ఈ స‌మ‌స్య ఎప్పుడో ఒక సారి వ‌స్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండ‌దు.కానీ, కొంద‌రిని మాత్రం త‌ర‌చూ హార్ట్ బ‌ర్న్ స‌మ‌స్య‌ వేధిస్తూనే ఉంటుంది.

అలాంటి వారు ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.అవేంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

గుండె మంట తరచుగా వస్తూంటే.మిరియాల‌ జోలికి అస్స‌లు వెళ్ల‌రాదు.నిజానికి మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కానీ, హార్ట్ బ‌ర్న్‌తో బాధ ప‌డే వారు వీటిని తీసుకుంటు స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది.

Telugu Bad Foods, Tips, Heartburn, Latest-Telugu Health - తెలుగు హ

అలాగే బయట దొరికే బజ్జీలు, వేయించిన ఆహారాలు, మసాల వంట‌కాలు తీసుకోవ‌డం పూర్తిగా త‌గ్గించాలి.మిరపకాయలు, క్యాప్సిక‌మ్, అల్లం, వెల్లుల్లి వంటివి చాలా మింతంగానే తీసుకోవాలి.

బ్రొకోలి, క్యాబేజి, ముల్లంగి, ట‌మాట‌ వంటి ఆహారాలు శ‌రీరానికి ఎన్నో పోష‌క విలువ‌ల‌ను అందిస్తాయి.కానీ, ఇవి త్వ‌ర‌గా జీర్ణం కావు.అందు వ‌ల్ల‌, త‌ర‌చూ హార్ట్ బ‌ర్న్ తో ఇబ్బంది ప‌డే వారికి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Telugu Bad Foods, Tips, Heartburn, Latest-Telugu Health - తెలుగు హ

ఇవే కాకుండా.పాలు, వెన్న, ఛీజ్, ఐస్ క్రీమ్, కాఫీ, టీ, ఆల్క‌హాల్‌, కొవ్వు ఎక్కువ‌గా ఉండే మాంసాలు, రాగి పిండితో త‌యారు చేసే ఆహారాలు, సిట్రస్ పండ్లు, బంగాళదుంప చిప్స్, ఉల్లిగడ్డ వంటి ఆహారాల‌ను కూడా ప‌క్క‌న పెట్టాలి.ఎందుకంటే, ఇవి అజీర్ణం కలిగిస్తాయి.

అంతే కాకుండా.గుండె మంటకు సైతం కారణం అవుతాయి.

కాబ‌ట్టి, ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube