యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dileep Kumar ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాకు రాక్( Rock ) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.2027 సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.రాక్ టైటిల్ ఎన్టీఆర్ కు బాగా సూట్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నిర్మాత నాగవంశీ( Producer Naga Vamshi ) ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా రాక్ టైటిల్ పాన్ ఇండియా మూవీకి పర్ఫెక్ట్ టైటిల్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ నెల్సన్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ తన లుక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలు చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది డ్రాగన్ సినిమాతో ఈ ఏడాది వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ రెండు సినిమాలు వేర్వేరుగా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే సినిమాలు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేవు.ఈ హీరో ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్నారు.







