1.కాంగ్రెస్ లో విలీనంపై షర్మిల కామెంట్స్
కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై చర్చలు తుది దశకు వచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( Y.S.Sharmila ) తెలిపారు.
2.బెజవాడ దుర్గమ్మ సేవలో తెలంగాణ గవర్నర్
బెజవాడ కనకదుర్గమ్మ ను తెలంగాణ గవర్నర్ తమిళ సై దర్శించుకున్నారు.అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
3.తుమ్మలతో పొంగులేటి భేటీ
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) తో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా పొంగులేటి ఆహ్వానించారు.దీనిపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుందని ప్రకటించారు.
4.హరికృష్ణ పై లోకేష్ కామెంట్స్
నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం హరికృష్ణ కు నివాళులర్పించారు .హరి మామయ్య డేరింగ్ పొలిటిషన్ అంటూ లోకేష్ అన్నారు.
5.20 జిల్లాలకు వర్ష హెచ్చరికలు
తెలంగాణలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఓ మాస్టారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.20 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
6.డీకే తో రేవంత్ భేటీ
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
7.సోనియా పై షర్మిల కామెంట్స్
ఎఫ్ఐఆర్ లో వైఎస్ పేరును చేర్చడం సోనియాకు తెలియక జరిగిన పొరపాటు అని, తెలిసి చేసిన తప్పు కాదని వైఎస్ షర్మిల అన్నారు.
8.వైయస్ రాజశేఖర్ రెడ్డి కి జగన్ నివాళులు
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు.
9.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది.ఈరోజు గోపాలపురం నియోజకవర్గం ప్రకాష్ రావు పాలెం క్యాంప్ సైట్ నుంచి యువ గళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.
10.రాజాసింగ్ కామెంట్స్
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు .అర్హులు కానీ బీఆర్ఎస్ వాళ్లకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లూ ఇచ్చారని రాజాసింగ్ విమర్శించారు.
11.నేడు రేపు 400 ప్రత్యేక బస్సులు
వారాంతపు సెలవులతో పాటు శుభముహూర్త రోజులు కావడంతో శని, ఆదివారాలలో 400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు త
మిళ నాడు రాష్ట్ర రవాణా శాఖ
ప్రకటించింది.
12.షర్మిల విజయలక్ష్మి నివాళులు
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన భార్య వైఎస్ విజయలక్ష్మి కుమార్తె షర్మిల ఇడుపులపాయలో నివాళులర్పించారు.
13.సంక్షేమ మెనూ కు కొత్త మార్గదర్శకాలు
ఏపీలోని సంక్షేమ హాస్టల్లో గురుకులాలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాసంస్థల్లో ఆహార మెనూ కు సంబంధించిన సరుకులు ,విద్యార్థులకు అవసరమైన ఆహార పదార్థాల సరఫరాకు ప్రస్తుతం ఉన్న కమిటీలను విధానాలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
14.జెమిలీ పై త్వరలో క్లారిటీ
జెమిని ఎన్నికల అంశంపై త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దీని కోసమే అనేది కేవలం ఊహాగానమైనదని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి అన్నారు.
15.2000 నోట్లపై ఆర్.బి.ఐ ప్రకటన
2000 నోట్లను తాత్కాలికంగా చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లుగా ఈ ఏడాది మే 19న ఆర్బిఐ ప్రకటించిన నేపథ్యంలో ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచింది.
16.కొప్పుల ఈశ్వర్ పై జీవన్ రెడ్డి విమర్శలు
కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు.
17.అనుచరులతో తుమ్మల భేటీ
నేడు అనుచరులతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు భేటీ అవుతున్నారు .పార్టీ మారే విషయంపై ఆయన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
18.నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1
సూర్యుడి పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య ఎల్ వన్ నింగిలోకి దూసుకు వెళ్ళింది శ్రీహరికోటలోని షార్ నుంచి ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 ను( Aditya L1 Mission ) పిఎస్ఎల్వి – సీ 57 వాహక నౌక నింగిలోకి పంపించింది.
19.ఎమ్మెల్యే టికెట్ కు బిజెపి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసేందుకు ఉత్సాహంగా ఉన్న పార్టీ నేతలు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ.బీజేపీ ప్రకటించింది.
20.ఒకే దేశం ఒకే ఎన్నికకు జనసేన మద్దతు
ఒకే దేశం ఒకే ఎన్నికకు జనసేన మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రకటించారు.