దేశంలో రోజురోజుకూ మానవ మృగాలు పెరిగిపోతున్నారు.ఆడ, మగ, పసి, ముసలి అనే తేడా లేకుండా చివరకు మూగజీవాల మీద కూడా తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.ఓ వ్యక్తి ఏకంగా మేకపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ షాకింగ్ ఘటన బుల్‌ంద్‌షహర్ జిల్లాలోని సలేంపూర్( Salempur in Bulandshahr district ) పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్నోరా గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ నీచమైన పనికి పాల్పడిన వ్యక్తి చంద్రభన్ సింగ్‌గా( Chandrabhan Singh ) గుర్తించారు.
ఇతను ఎన్‌టీపీసీలో ఉద్యోగం చేసి రిటైరయ్యాడు.ప్రస్తుతం గోకుల్‌ధామ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
చంద్రభన్‌కు ఒక ఫామ్‌హౌస్ కూడా ఉంది.అందులో మేకలు, పందులను పెంచుతున్నాడు.
అసలు విషయం ఏమిటంటే, చంద్రభన్ సింగ్ తన ఫామ్‌హౌస్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.అనుకోకుండా ఒకరోజు వేరే వాళ్లు రికార్డింగ్స్‌ను పరిశీలిస్తుండగా, అందులో చంద్రభన్ ఓ మేకను గదిలోకి లాక్కెళ్లి, ఆ తర్వాత దుస్తులు లేకుండా బయటకు రావడం కనిపించింది.
ఈ వీడియో చూసి అందరూ షాకయ్యారు.వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
స్థానిక శివసేన కార్యకర్తలు ( Shiv Sena activists )ఈ వీడియోను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే వారు జిల్లా ఎస్పీని కలిసి వీడియో సాక్ష్యాలను చూపించారు.నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా, చంద్రభన్ సింగ్ గత కొన్ని నెలలుగా మూగజీవాలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.దీనికి సంబంధించిన మరిన్ని వీడియో సాక్ష్యాలూ తమ వద్ద ఉన్నాయని పోలీసులకు తెలిపారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
షికార్‌పూర్ సీఓ శివ ఠాకూర్ ( Shikarpur CO Siva Thakur )మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితుడిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అయితే బుల్‌ంద్‌షహర్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు.గతేడాది ఆగస్టులో షికార్‌పూర్ ప్రాంతంలోనే వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తి కూడా ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు.అతనో మైనర్ దళిత బాలికపై అత్యాచారం చేయడంతో పాటు, మేకపై కూడా లైంగిక దాడి చేశాడు.
ఆ వీడియోలు వైరల్ కావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇలా బుల్‌ంద్‌షహర్ ప్రాంతంలో మనుషులపైనే కాకుండా మూగజీవాలపై కూడా లైంగిక దాడులు జరగడం చాలా కలవరపెడుతోంది.
చంద్రభన్ సింగ్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.