మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి?

మద్వయ పురాణాలు మొత్తం రెండు రకాలు.అయితే అందులో మొదటిది మత్స్య పురాణం.

 What Is Madyvaya Puranalu, Matsya Puranam , Markandeya Puranam , Madvaya Puran-TeluguStop.com

రెండోది మార్కండేయ పురాణం.ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

కానీ మత్స్య పురాణం, మార్కండేయ పురాణాల గురించి మాత్రం వినే ఉంటారు.అయితే అందులో ఏముంటుంది, ఎన్ని శ్లోకాలు ఉంటాయనే అంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మత్స్య పురాణం

. అష్టాదశ పురాణాలలో పదహారో పురాణమే మత్స్య పురాణం.

ఈ పురాణాన్ని శ్రీ మహా విష్ణువు మెదడుతో పోల్చబడిన అర్థాన్ని సూచిస్తుంది.ఈ పురాణంలో 289 అధ్యాయాలు ఉండగా… మొత్తం 14 వేల శ్లోకాలు ఉన్నాయి.

మత్స్యావతారం ఎత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడింది.కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణాలు, ప్రయాగ, వారణాసి తదితర పుణ్య క్షేత్రాల మహత్యాలు దీనిలో పూర్తిగా వివరించారు

మార్కండేయ పురాణం

 మార్కండేయ పురాణములో శైవులు, వైష్ణవులు, మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు.ఈగ్రంథం శివునికి, విష్ణువుకూ, వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది.

ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభం అవుతుంది.దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉంది.

అలాగే మొత్తం 9 వేల శ్లోకాలు ఉన్నాయి.మార్కం డేయ మహర్షి చెప్పినది.

శివ, విష్ణువు మహత్మ్యాలు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యాలు, సప్త శతి లేదా దేవీ మహత్మ్యం ఉన్నాయి.చండీ హోమం, శత చండీ, సహస్ర చండీ హోమ విధానానికి ఈ సప్త శతియే ఆధారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube