అంగరంగ వైభవంగా రంగనాథుడి రధోత్సవం..

ప్రస్తుతం మన దేశంలోని చాలా ఆలయాలలో గ్రామ ఉత్సవాలు, రథోత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి.తాజాగా తొండపాడు లో వెలసిన బోలికొండ రంగనాథ స్వామి రథోత్సవం కళ్యాణనికి ఆదివారం ఎంతో మంది భక్తులు తరలి వచ్చి ఘనంగా నిర్వహించారు.

 Ranganath's Rathotsavam With Great Splendor  Ranganathaswamy , Rathotsavam ,bol-TeluguStop.com

తెల్లవారు జామున శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించారు.ఆ తర్వాత అర్చకులు స్వామి వారికి హోమాలు, ప్రతిజ్ఞ పూజలు కూడా చేశారు.

స్వామి వారి రథాన్ని పుష్పాలతో అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి ఉత్సవాలు భక్తులను కొలువుదీర్చారు.సాయంత్రం దేవాలయా ఈఓ దేవదాసు, మాణిక్య రంగనాథ స్వామి దేవాలయ ధర్మకర్త మకాం శ్రీకాంత రథాన్ని లాగి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

దేవాలయం నుంచి జమ్మి చెట్టు వరకు భక్తులతో కలిసి రథాన్ని లాగరు.భక్తులు రథం పైకి అరటి పండ్లు, బెల్లం, తీపి బెండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు.

రథాన్ని లాగడానికి భక్తులు సంతోషంగా ముందుకు వచ్చారు.కమిటీ చైర్మన్ రామాంజి రాయల్,మన్రో సత్రం, మాజీ చైర్మన్ రాము రాయల్ తహసిల్దార్ మహబూబ్ బాషా కూడా పాల్గొన్నారు.

Telugu Andhra Pradesh, Bolikonda, Devotees, Devotional, Rathotsavam, Tondapadu-L

ఇంకా చెప్పాలంటే సిఐ వెంకట్రామిరెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, చాంద్ బాషా, గోపాలుడు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.రథోత్సవం సందర్భంగా ఎద్దుల బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పలు ప్రాంతాల నుంచి ఎద్దుల పండ్లు, ట్రాక్టర్లను ప్రత్యేకంగా అలంకరించుకుని స్వామి వారి దేవాలయం చుట్టూ ఊరేగించారు.భక్తులు అక్కడే రాత్రికి బస చేసి తిరిగి వెళ్ళడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube