ఇంట్లో నిత్యం గొడవలు ఉంటున్నాయా..? అయితే వంటగదిలో ఇవి పాటించండి..

చాలామంది ఈ మధ్యకాలంలో వాస్తుని నమ్ముతున్నారు.అయితే మరికొందరు కొన్ని పొరపాటుల వల్ల వాస్తు దోషాలు( Vastu Doshas ) చేస్తుంటారు.

 Are There Constant Fights At Home But Follow These In The Kitchen , Kitchen Des-TeluguStop.com

అయితే ముఖ్యంగా వంటగదిలో ఏ వస్తువు ఏ దిశలో ఉంచాలన్న విషయంలో మనకు ఖచ్చితంగా సరైన అవగాహన ఉండాలి.అయితే ఏ వస్తువును ఏ దిశలో ఉంచితే వాటి ప్రభావాలు మన మీద ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.

అందుకే వాస్తు మార్గదర్శక ప్రకారం వంటగదిని డిజైన్( Kitchen design ) చేసుకోవాలి.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అగ్ని ఇంటి ఆగ్నేయ దిశలో ప్రభలంగా ఉంటాడు.

అందుకే వంటగది ఆదర్శస్థానం ఇంటికి ఆగ్నేయ దిశ.ఇక అలా వంటగదిని నిర్మించలేకపోయినప్పుడు వాయువ్య దిశ పని చేస్తుంది.అలాగే వంటగదిని ఇంటికి ఉత్తరం ఈశాన్య లేదా నైరుతి దిశలో ఎప్పటికీ కూడా నిర్మించకూడదు.ఎందుకంటే ఇలా నిర్మిస్తే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి.

Telugu Cylinders, Gas, Kitchen Design, Microwave Ovens, Posters, Vasthu, Vasthu

ఇక వంట గదిలో ఉన్న ప్రతి వస్తువు కూడా అగ్నిని( fire ) సూచిస్తాయి.అందుకే గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు, మైక్రోవేవ్ ఒవేన్లు, పోస్టర్లు( Gas stoves, cylinders, microwave ovens, posters ) ఇతర ఉపకరణాలతో పాటు వంటగది ఆగ్నేయ భాగంలో ఉండేటట్టు చూసుకోవాలి.అలాగే వంట చేసే సమయంలో తూర్పు ముఖంగా ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే ఇది సానుకూల శక్తిని నిర్ధారిస్తుంది.ఇక వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ సిలిండర్, ఓవెన్, వాష్ బేసిన్లు వంటగదిలో ఎప్పుడూ ఒకే ప్లాట్ఫారంపై లేదా ఒక్కదానికొకటి సమాంతరంగా ఉండకూడదు.

Telugu Cylinders, Gas, Kitchen Design, Microwave Ovens, Posters, Vasthu, Vasthu

ఇలా ఉంటే అగ్ని, నీరు రెండు వ్యతిరేక మూలకాలు గా ఉన్నట్టే.దీని వలన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి.ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య అనుకోకుండా చాలా తగాదాలు వస్తూ ఉంటాయి.

అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు రిఫ్రిజిరేటర్ ను నైరుతి దిశలో ఉంచాలి.ఇలా చేస్తే ప్రశాంతమైన వంటగది వాతావరణం ఏర్పడుతుంది.అంతేకాకుండా ధాన్యాలు, ఇతర పదార్థాల నిల్వ వంటగదికి నైరుతి దిశలో ఉంచాలి.ఇలా చేస్తే అదృష్టం, శ్రేయస్సు కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube